Loading...
Ayodhya Ram Temple Trust: అయోధ్య ట్రస్ట్ తొలి సీఈవో ఎంపిక పూర్తి.. తుది జాబితాలో ముగ్గురు
అయోధ్య ట్రస్ట్ తొలి సీఈవో ఎంపిక పూర్తి.. తుది జాబితాలో ముగ్గురు

Ayodhya Ram Temple Trust: అయోధ్య ట్రస్ట్ తొలి సీఈవో ఎంపిక పూర్తి.. తుది జాబితాలో ముగ్గురు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సీఈవో ఎంపికపై బుధవారం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. మొత్తం 5,500కు పైగా దరఖాస్తులను పరిశీలించిన నిపుణుల కమిటీ.. చివరకు ముగ్గురు అభ్యర్థులతో కూడిన తుది జాబితాను సిద్ధం చేసింది. అయోధ్యలోని మణిరాందాస్ చావనీలో ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ నివాసంలో జరిగే సమావేశంలో సీఈవోతో పాటు ఖాళీగా ఉన్న ఇతర కీలక పదవుల భర్తీపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

వివరాలు 

5,585 దరఖాస్తుల పరిశీలన

సీఈవో ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలో రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డే ఉన్నారు.

వీరి ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ కొనసాగింది. మొత్తం 5,585 దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించినట్లు ట్రస్ట్ 'ఎక్స్‌' (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది.

జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అభ్యర్థుల అర్హతలు, సామర్థ్యాలను 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అంచనా వేశారు.

తొలిదశ పరిశీలన తర్వాత 3,577 మంది అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలను పంపించారు. వీరిలో కనీసం 470 మార్కులు సాధించిన 108 మందిని తదుపరి దశకు అర్హులుగా గుర్తించారు.

వివరాలు 

వర్చువల్ ఇంటర్వ్యూలతో మరింత వడపోత

అర్హత సాధించిన 108 మందికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా 17 మంది అభ్యర్థులను వివిధ గ్రేడ్లుగా విభజించారు.

అనంతరం వారి నిబద్ధత, దార్శనికత, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని అత్యుత్తమంగా నిలిచిన ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేశారు.

ఈ ముగ్గురి పేర్లను ట్రస్ట్‌కు సమర్పించారు.

ADVERTISEMENT

వివరాలు 

కీలక ఖాళీల భర్తీకి కూడా నిర్ణయం

ఇటీవల ట్రస్ట్‌లో ఏర్పడిన పలు ఖాళీల నేపథ్యంలో తాజా నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మృతి చెందడం, కానుకల చోరీకి సంబంధించిన ఆరోపణలు రావడం, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేయడంతో పలు కీలక స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో సీఈవోతో పాటు ఇతర ముఖ్య పదవులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

జగదీశ్ ఆఫ్లేకు కీలక బాధ్యతలు?

ట్రస్ట్ తొలి కార్యదర్శి పదవికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ ఆఫ్లేను నియమించే అవకాశమున్నట్లు సమాచారం.

మరోవైపు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్డాను కూడా ట్రస్ట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తుది నిర్ణయం బోర్డుదే

సీఈవోతో పాటు ఇతర కీలక నియామకాలపై తుది నిర్ణయాన్ని ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రకటించనుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు.

దీంతో బుధవారం జరిగే సమావేశంపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT