Loading...
Reliance-Musk: భారత్‌లో అన్ని సంస్థలకూ ఒకే నిబంధనలు.. మస్క్‌ ఆరోపణలపై రిలయన్స్
భారత్‌లో అన్ని సంస్థలకూ ఒకే నిబంధనలు.. మస్క్‌ ఆరోపణలపై రిలయన్స్

Reliance-Musk: భారత్‌లో అన్ని సంస్థలకూ ఒకే నిబంధనలు.. మస్క్‌ ఆరోపణలపై రిలయన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల ప్రవేశాన్ని కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీని ఉద్దేశించి 'ప్రధాని అంబానీ' అంటూ ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై రిలయన్స్‌ తాజాగా స్పందించింది. స్టార్‌లింక్‌తో పాటు శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ రంగంలోకి వచ్చే ఇతర సంస్థలనూ స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. పోటీకి తాము ఏమాత్రం భయపడబోమని పేర్కొంటూ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత మార్కెట్‌, రిలయన్స్‌ గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను వెల్లడించాల్సి ఉందని సంస్థ తెలిపింది. ప్రజల జీవితాలను మెరుగుపరిచే స్వదేశీ,అంతర్జాతీయ పెట్టుబడులు,సాంకేతిక ఆవిష్కరణలను స్వాగతించే భారతదేశంలోనే రిలయన్స్‌ అభివృద్ధి చెందిందని పేర్కొంది.

వివరాలు 

పోటీని ఎప్పుడూ స్వాగతిస్తాం

పారదర్శకత అనేది చట్టబద్ధమైన పాలనపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా దేశీయ, విదేశీ సంస్థలన్నింటికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది.

జియో కూడా తన శాటిలైట్‌ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల కోసం ఎదురుచూస్తోందని తెలిపింది.

పోటీకి తాము ఎన్నడూ భయపడలేదని రిలయన్స్‌ స్పష్టం చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలను ఎవరు అందిస్తారో నిరూపించుకునే అవకాశంగానే పోటీని చూస్తామని పేర్కొంది.

2016లో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కొత్త సంస్థగా జియో అడుగుపెట్టిందని గుర్తుచేసింది.

కేవలం పదేళ్లలోనే 53 కోట్ల మంది వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించిందని తెలిపింది.

భారతీయులకు ప్రపంచస్థాయి డిజిటల్‌ మౌలిక సదుపాయాలతో పాటు తక్కువ ధరకు డేటా సేవలను అందించామని వివరించింది.

వివరాలు 

పోటీని ఎప్పుడూ స్వాగతిస్తాం

స్టార్‌లింక్‌ మాత్రమే కాకుండా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ రంగంలోకి వచ్చే ఏ సంస్థనైనా స్వాగతిస్తామని రిలయన్స్‌ వెల్లడించింది.

జియోతో పాటు ప్రతి సంస్థ భారత ప్రజలకు సేవలందించాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొంది.

అయితే, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఏ కంపెనీ అయినా దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

మస్క్‌ ఆరోపణలు ఏమిటంటే?

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభం కాకుండా కొందరు వ్యాపారవేత్తలు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎలాన్‌ మస్క్‌ ఇటీవల తన ఎక్స్‌ ఖాతాలో ఆరోపించారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీని ఉద్దేశించి 'ప్రధాని అంబానీ' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

భారత ప్రభుత్వ విధానాలను అంబానీనే శాసిస్తున్నారా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. అయితే, మస్క్‌ ఆరోపణలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.

భారత్‌లో పనిచేసే సంస్థలన్నింటికీ నిబంధనలు సమానంగానే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT