Loading...
Mahrah Al Nahyan: లండన్ వీధిలో అపస్మారక స్థితిలో యూఏఈ రాజకుటుంబ మహిళ.. పక్కనే చిన్నారి
లండన్ వీధిలో అపస్మారక స్థితిలో యూఏఈ రాజకుటుంబ మహిళ.. పక్కనే చిన్నారి

Mahrah Al Nahyan: లండన్ వీధిలో అపస్మారక స్థితిలో యూఏఈ రాజకుటుంబ మహిళ.. పక్కనే చిన్నారి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అబుదాబి అల్ నహ్యాన్ రాజకుటుంబానికి చెందిన 32 ఏళ్ల మహ్రా అల్ నహ్యాన్‌.. మాదకద్రవ్యాల ప్రభావంతో లండన్ వీధిలో అపస్మారక స్థితిలో కనిపించారు. ఆమె సంరక్షణలో ఉన్న మూడేళ్ల చిన్నారి సమీపంలోని రద్దీ రహదారి పక్కన చెప్పులు లేకుండా స్కూటర్‌తో ఆడుకుంటూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి చిన్నారిని నిర్లక్ష్యం చేసిన కేసులో ఆమె నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు ఆమెకు రెండేళ్ల కమ్యూనిటీ ఆర్డర్‌తో పాటు పునరావాస కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది. అంతేకాకుండా జరిమానాలు, కోర్టు ఖర్చుల కింద 6,114 పౌండ్లు చెల్లించాలని తీర్పునిచ్చింది.

వివరాలు 

ఎవరీ మహ్రా అల్ నహ్యాన్?

ఎవరీ మహ్రా అల్ నహ్యాన్? మహ్రా అల్ నహ్యాన్‌.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని అబుదాబిని పాలించే అల్ నహ్యాన్ కుటుంబంతో వివాహం ద్వారా సంబంధం కలిగి ఉన్నారు.

ఈ కుటుంబం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, ప్రభావవంతమైన రాజవంశాల్లో ఒకటిగా పేరొందింది.

యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ ఇదే కుటుంబానికి చెందినవారు.

ఆమెకు నెలకు సుమారు 8,000 పౌండ్ల భత్యం అందుతున్నట్లు కోర్టు విచారణ సందర్భంగా వెల్లడైనట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది.

వివరాలు 

లండన్ వీధిలో ఏం జరిగింది?

ఈ ఏడాది జూన్ 13న పశ్చిమ లండన్‌లోని ఓ వీధిలో మహ్రా లోహపు కంచెకు ఆనుకుని అపస్మారక స్థితిలో కనిపించారు.

సమీపంలో మరో వ్యక్తి కూడా స్పృహ లేకుండా పడి ఉన్నారు.ఈ సమయంలో మూడేళ్ల చిన్నారి చెప్పులు లేకుండా స్కూటర్‌తో ఆడుకుంటూ రద్దీ రహదారికి దగ్గరగా ఉన్నాడు.

చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, పోలీసులు వచ్చే వరకు అతడి వద్దే ఉన్నారు.

కోర్టులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘటనకు ముందు కొన్ని రోజుల పాటు మహ్రా కొకైన్ తీసుకున్నారు.

అయితే, ఘటన జరిగిన రోజు ఆమె మాదకద్రవ్యాలు తీసుకోలేదని, అంతకుముందు వాటిని వినియోగించడం వల్ల తీవ్ర అలసటకు గురయ్యారని ఆమె తరఫు న్యాయవాది స్టీఫెన్ వుల్లో తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

కోర్టు ఏం చెప్పింది?

ఆమె తన తప్పిదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని, మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు.

ఘటన జరిగినప్పటి నుంచి మహ్రా సర్రేలోని వోకింగ్‌లో ఉన్న ప్రియరీ క్లినిక్‌లో మాదకద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్నారు.

అక్టోబర్ చివరి నాటికి మూడు నెలల చికిత్సా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆమె న్యాయవాది తెలిపారు.

ఆ తర్వాత గిల్డ్‌ఫోర్డ్ ప్రాంతంలో నివసిస్తూ నార్కోటిక్స్ అనానిమస్ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

కోర్టు ఏం చెప్పింది?

సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జెరెమీ జాన్సన్ మాట్లాడుతూ.. స్థానికులు జోక్యం చేసుకోకపోతే చిన్నారికి తీవ్ర గాయాలు కావడం లేదా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

చిన్నారిని మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్న పెద్దల పర్యవేక్షణ లేకుండా వీధిలో వదిలేయడం అతడి భద్రత పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు.

ఈ కేసులో మహ్రాకు రెండేళ్ల కమ్యూనిటీ ఆర్డర్ విధించడంతో పాటు పునరావాస చికిత్స కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

ADVERTISEMENT