Page Loader
Jio New Year Offer 2024: యూజర్లకు 'న్యూ ఇయర్ 2024' ఆఫర్‌ను ప్రకటించిన జియో 
Jio New Year Offer 2024: యూజర్లకు 'న్యూ ఇయర్ 2024' ఆఫర్‌ను ప్రకటించిన జియో

Jio New Year Offer 2024: యూజర్లకు 'న్యూ ఇయర్ 2024' ఆఫర్‌ను ప్రకటించిన జియో 

వ్రాసిన వారు Stalin
Dec 24, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

Jio New Year Offer 2024: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం నూతన సంవత్సర ఆఫర్‌ను ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే 2023 ఏడాదికి స్వస్తి పలికి.. 2024లోకి అడుగుతున్న నేపథ్యంలో జియో కంపెనీ తన వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందించేందుకు ఈ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే ఈ కొత్త సంవత్సరం ఆఫర్ ప్రస్తుతం రూ. 2999 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త సంవత్సరం ఆఫర్ సందర్భంగా రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే.. అదనపు సర్వీస్ వాలిడిటీని కూడా వినియోగదారులు పొందుతారు.

జియో

24 రోజులు అదనంగా..

సాధారణంగా జియో వినియోగదారుడు రూ. 2,999 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటాను పొందుతారు. అంటే ఏడాదికి 912.5GB డేటాను పొందుతారు. అదే న్యూ ఇయర్ ఆఫర్‌లో ఆఫర్ సమయంలో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీకి అదనంగా మరో 24 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అంటే.. మొత్తం 389 రోజుల పాటు దీని వ్యాలిడిటీకి ఉంటుంది. అలాగే వినియోగదారుడు ఏడాదికి సుమారుగా 970GB డేటాను పొందుతారు. 389 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ కింద జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను కంపెనీ అందిస్తోంది.