Page Loader
Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట 
Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట

Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట 

వ్రాసిన వారు Stalin
Jan 11, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక మాధ్యమం దిగ్గజం ట్విట్టర్(ఎక్స్-Social Media X) ఇటీవల హానికరమైన కంటెంట్ విపరీతంగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే హానికరమైన, విద్వేషపూరిత కంటెంట్ పెరగడానికి గల కారణాలకు ఒక కారణం ఉందని ఆస్ట్రేలియా కేంద్రంగా పని చేస్తున్న 'ఈ-సేఫ్టీ కమిషన్‌' వెల్లడించింది. ట్విట్టర్(ఎక్స్)లోని కీలక విభాగం నుంచి ఉద్యోగుల తొలగింపుతో పాటు గతంలో నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం వంటి చర్యల వల్ల 'ఎక్స్'లో హానికర కంటెంట్ పెరిగినట్లు 'ఈ-సేఫ్టీ కమిషన్‌' చెప్పింది.

ఎక్స్

ఉద్యోగులు కంపెనీని వీడడం వల్లే ఈ సమస్య

ప్రస్తుతం 'ఎక్స్‌'లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు వారి బాధ్యతలను సమీక్షించిన తర్వాత తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు 'ఈ-సేఫ్టీ కమిషన్‌' పేర్కొంది. ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిన తర్వాత.. ఈ సంస్థ విశ్వసనీయత, భద్రత వంటి కీలక విభాగంలో పని చేసే దాదాపు 1213 ఉద్యోగులు కంపెనీని వీడినట్లు కమిషన్‌ వెల్లడించింది. స్వయంగా ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్లు చెప్పింది. కంపెనీని వీడిన 1213 ఉద్యోగుల్లో 80 శాతం మంది ట్విట్టర్‌లోని సమాచార భద్రతపై పని చేసేవారని వివరించింది. ఫలితంగా ప్రస్తుతం ఎక్స్‌లో హానికర కంటెంట్‌‌ను నిలువరించే వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని చెప్పింది.