US-India trade deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తొలి దశ ఖరారు.. పీయూష్ గోయెల్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంలో తొలి దశ ఖరారైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. ప్రస్తుతం ఒప్పందానికి సంబంధించిన చట్టపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని తెలిపారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
సుంకాల అంశంపై స్పష్టత వచ్చిన అనంతరం ఒప్పందం తదుపరి ప్రక్రియ
అమెరికాతో వాణిజ్య ఒప్పందం మొదటి దశ పూర్తయిందని, దీనికి అవసరమైన చట్టపరమైన ముసాయిదా తుది దశలో ఉందని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.
వీలైనంత త్వరగా ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అయితే, అమెరికా సుంకాలకు సంబంధించి అధికారికంగా స్పష్టత వచ్చిన తర్వాతే వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేయనున్నాయని రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు.
సుంకాల అంశంపై స్పష్టత వచ్చిన అనంతరం ఒప్పందం తదుపరి ప్రక్రియ ముందుకు సాగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన చేసిన పీయూష్ గోయెల్
Indian Trade Minister Goyal on India, US trade agreement 1st tranche:
— Sidhant Sibal (@sidhant) October 15, 2026
"It has been finalized, going thru final, legal drafting. Hope to finalize soon, operationalise it once we get competitive advantage to peer countries" pic.twitter.com/JkRmBZrdRm