Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ లుక్ వెనుక అసలు కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ తన స్టైల్, గ్రేస్‌తో ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతేడాది ఆమె లుక్స్ ఒక ప్రత్యేక హైలైట్‌గా మారుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ సంవత్సరం కూడా ఆమె రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు. ఈసారి కేన్స్ వేదికపై ఐశ్వర్యారాయ్ ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన 'లుమినారా' అనే డీప్ శాఫైర్-బ్లూ (నీలిరంగు) గౌన్‌లో మెరిశారు. ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది.ఆ
వివరాలు
గౌన్ కోసం ఎంతో శ్రమించిన డిజైనర్స్
ఈ గౌన్‌ను రూపొందించడానికి డిజైనర్స్ ఎంతో శ్రమించారు. 'క్రిస్టల్ వీన్' ఎంబ్రాయిడరీ టెక్నిక్‌ను ఉపయోగించి దాదాపు 1,500 గంటలు (సుమారు 62 రోజులు) పూర్తిగా హ్యాండ్‌వర్క్‌తో తయారు చేశారు. కెమెరా ఫ్లాష్ పడినప్పుడు ఈ గౌన్‌పై లిక్విడ్ కదులుతున్నట్లుగా కనిపించే ఆప్టికల్ ఇల్యూషన్ ప్రభావం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లుక్‌ను మరింత హైలైట్ చేస్తూ డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్, సిల్కీ హెయిర్‌స్టైల్‌తో ఐశ్వర్య తన గ్లామర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. డిజైనర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఐశ్వర్య ఎప్పుడూ కేన్స్ వేదికను తనదైన స్టైల్‌తో రూల్ చేస్తుంటారు.
వివరాలు
"కేన్స్ క్వీన్"గా ఐశ్వర్య రాయ్
ఈసారి కూడా ఆమెను నిజమైన క్వీన్‌లా చూపించాలనే ఉద్దేశంతో ఈ లుక్‌ను రూపొందించామని తెలిపారు. ఐశ్వర్యారాయ్ ఇప్పటివరకు మొత్తం 24 సార్లు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. 2002లో దేవదాస్ సినిమా ప్రీమియర్ కోసం ఆమె తొలిసారిగా ఈ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు దశాబ్దాలకు పైగా కేన్స్ వేదికపై తనదైన ముద్ర వేస్తూ ఆమెను "కేన్స్ క్వీన్"గా అభిమానులు పిలుస్తున్నారు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Aishwarya, Aishwarya, Aishwarya 💖💖💖💖💖#AishwaryaRai #AishwaryaRaiBachchan #Cannes2026 pic.twitter.com/NwPfq7WbPO
— aish_my_queen (@AishwaryaRai01) May 22, 2026