పాకిస్థాన్: వార్తలు

SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు.

ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది అభిమానుల మనుసుల మనషుల్ని గెలుచుకున్నాడు. 2018 లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.

ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌కు ప్రమాదం; పాక్ మాజీ ప్రధాని కారు సేఫ్

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌లోని వాహనం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అయితే ఇమ్రాన్ వెళ్తున్న కారు సురక్షితంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పాకిస్థాన్ మీడియా తెలిపింది.

టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం

టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఎలిమినేటర్ 1లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆ ఫీట్ ను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో లాహోర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడాటానికి ఇమ్రాన్ జమాన్ పార్క్ ఇంటి నుంచి బయటికు వచ్చారు. ఆయిన గ్యాస్ మాస్క్ ధరించి బయటకు రావడం గమనార్హం.

రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, బలగాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని గంటలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి

2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశం భారతదేశం, అంతకుముందు సంవత్సరం ఉన్న ఐదవ స్థానం నుండి పడిపోయింది. అయితే ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సురక్షిత పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ.

పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్

ఆసియా కప్ 2023 టోర్ని వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా లేదు. పాకిస్తాన్ లో ఆసియా కప్ 2023 టోర్ని జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి టీమిండియా వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నిని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహిళా జడ్జిని బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ చేరుకున్నారు.

13 Mar 2023

విమానం

ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి

దిల్లీ నుంచి దోహా‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు.

PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలన రికార్డులు నమోదవుతున్నాయి. మ్యాచ్ స్కోర్లు 200 ప్లస్ దాటినా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌ను చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్రాత్మక రికార్డు అవిష్కరించబడింది.

పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ రూసో విధ్వంసం సృష్టించాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం

పీఎస్ఎల్‌లో సరికొత్త సంచలన రికార్డు నమోదైంది. జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 63 బంతుల్లో 145 పరుగులు చేశారు. దీంతో పెషావర్ జాల్మీ జట్టు విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా చేధించింది.

పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్

షెషావర్ జల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్ జల్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబార్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు.

పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్

పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు.

పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా

పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.

బాబర్‌ను విడిచే ప్రసక్తే లేదు : షోయబ్ అక్తర్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్న పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు సారిథి బాబర్ ఆజమ్‌కు ఇంగ్లీష్ రాదని, ఆతడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, అందుకే బ్రాండ్ కాలేకపోయాడనికి గతంలో షోయబ్ చేసిన విమర్శలు మరోసారి పెద్ద దూమారం అయ్యాయి.

ఎరిన్ హాలండ్‌‌ను చంకన ఎత్తుకున్నన్యూజిలాండ్ మాజీ క్రికెటర్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత బౌలింగ్‌తో మేటీ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐపీఎల్‌ టోర్నిలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో కూడా డానీ ఒకరు. అలాంటి డానీ ఒక్కోసారి తన వింత ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు

టీవీ ఛానళ్లలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని నిషేధించిన పాకిస్థాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ

పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. ఆయన ప్రసంగాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

PSL: వావ్.. సూపర్ మ్యాన్‌లా బంతిని ఆపిన సికిందర్ రాజా

ఒకప్పుడు అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే ప్లేయర్లలో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా అని చెప్పేవాళ్లు. కొంతమంది ఆటగాళ్లు బౌండరీ లైన్ల మధ్య అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ ఔరా అనిపిస్తుంటారు. సిక్సర్ వెళ్లకుండా బంతిని పట్టుకొని కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటారు.

ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం

స్వదేశంలో టీమిండియాను ఓడించడం విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. భారత్ ను ఓడించాలని దిగ్గజ టీంలు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. 1996లో మొదలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2004 లో మాత్రమే టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది.

పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు.

17 Feb 2023

ప్రపంచం

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా

లాహోర్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హై డ్రామా జరిగింది. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారంటూ వందలాది మంది పిటిఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?

పాకిస్థాన్‌లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన పాకిస్తాన్ మహిళా ప్లేయర్

మహిళా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహిళల టీ20లలో శతకం బాదిన మొదటి పాకిస్తాన్ మహిళా ప్లేయర్ మునీబా చరిత్ర సృష్టించింది. 68 బంతుల్లో 102 పరుగులు (14 బౌండరీలు) చేసింది. దీంతో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

16 Feb 2023

ధర

పాక్‌లో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు; లీటరు పెట్రోల్ రూ.272, డీజిల్ రూ.280

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది ప్రభుత్వం.

లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్

ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల్లోనే పాల ధరలు రూ. 30 వరకు పెరిగాయి. దీంతో పాక్‌లో లీటరు పాల ధర రూ. 210కి చేరింది.

10 Feb 2023

ఐఎంఎఫ్

పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్‌తో పది రోజుల నుంచి పాక్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు.

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్

పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు.

వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్‌పై అభ్యంతరాలు

దాయాది దేశం పాకిస్థాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నందునే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) వెల్లడించింది.

03 Feb 2023

ఎన్ఐఏ

'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్

ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం.

గాయాలపై పోరాటం చేయలేకపోయా : షాహీన్ ఆఫ్రిది

ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌గా షామీన్ ఆఫ్రిదికి పేరుంది. యార్కర్లతో ప్రత్యర్థులకు బోల్తా కొట్టించే సత్తా ఆఫ్రిదికి ఉంది. అద్భుత బౌలింగ్ ఫెర్ఫామెన్స్‌తో పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్రిది 25 టెస్టులు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు.

పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు

పాకిస్థాన్‌లో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి, బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి

పాకిస్థాన్‌‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ: 'అల్-ఖైదాతో సంబంధాలు లేవు, బిన్ లాడెన్‌ను ఎప్పుడూ కలవలేదు'

ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) ఇటీవల గుర్తించింది. అయితే దీనిపై తాజాగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ స్పందించారు. అల్-ఖైదాతో గాని, ఇస్లామిక్ స్టేట్‌తో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని మక్కీ చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోలో విడుదల చేశారు.

భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్

పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సహచర క్రికెటర్ తో సెక్స్ చాట్ చేసినట్లు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాబర్ అజామ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు.