Pakistan: అమెరికా షేర్ చేసిన భారత్ మ్యాప్.. పాక్ ఒత్తిడితో డిలీట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరిన సందర్భంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్ మ్యాప్‌ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చివరకు తమ ఒత్తిడితో ఆ మ్యాప్‌ను తొలగించేలా అమెరికా అధికారులను ఒప్పించడంలో పాక్ సఫలమైంది. కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించి, ఆ ప్రాంతాన్ని 'జీవనాడి'గా పేర్కొంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇస్తోందన్న ఆరోపణలు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో, పాక్ వాదనలకు విరుద్ధంగా భారత్ భూభాగాన్ని ఉన్నదున్నట్టుగా చూపించే మ్యాప్‌ను అమెరికా షేర్ చేయడం పాకిస్థాన్‌కు ఆగ్రహం తెప్పించింది.
వివరాలు
కశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే: రాజ్‌నాథ్ సింగ్
దీన్నిచూసి తట్టుకోలేకపోయిన పాకిస్థాన్.. అమెరికా అధికారులను ఒప్పించి, దాన్ని తొలగించాలని ప్రాధేయపడటంతో వారు దానిని తొలగించారు మ్యాప్ వెలువడిన వెంటనే తాము చర్యలు తీసుకున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి వెల్లడించడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా, కశ్మీర్ అంశంపై భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేస్తోంది. కశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమేనని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లేకుండా జమ్మూకశ్మీర్ సంపూర్ణం కాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పీవోకే భారతదేశానికి విదేశీ భూభాగం కాదని, అది భారత్‌లో విడదీయరాని భాగమేనని ఆయన స్పష్టం చేశారు.