LOADING...
Peddi: ఓటీటీలోకి అడుగుపెట్టిన 'పెద్ది'.. అదనపు సన్నివేశాలతో అభిమానులకు ప్రత్యేక ట్రీట్
ఓటీటీలోకి అడుగుపెట్టిన 'పెద్ది'.. అదనపు సన్నివేశాలతో అభిమానులకు ప్రత్యేక ట్రీట్

Peddi: ఓటీటీలోకి అడుగుపెట్టిన 'పెద్ది'.. అదనపు సన్నివేశాలతో అభిమానులకు ప్రత్యేక ట్రీట్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన 'పెద్ది' చిత్రం తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. విశేషం ఏమిటంటే.. థియేటర్లలో ప్రదర్శించిన వెర్షన్‌తో పోలిస్తే, ఓటీటీ విడుదలలో కొన్ని అదనపు సన్నివేశాలను చేర్చారు. రన్‌టైమ్ పరిమితుల కారణంగా థియేటర్ల కోసం తొలగించిన సీన్స్‌తో పాటు, విడుదల అనంతరం ఎడిట్ చేసిన కొన్ని భాగాలను కూడా ఈ వెర్షన్‌లో పొందుపరిచినట్లు సమాచారం. దీంతో అభిమానులు ఈ కొత్త వెర్షన్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

వివరాలు

కథ ఎలా సాగుతుందంటే..

విజయనగరం జిల్లాలో కొండ అడువున ఉన్న ఒక చిన్న గ్రామం కథకు నేపథ్యం. అక్కడ వందలాది కుటుంబాలు జీవిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో ఆ గ్రామానికి ఎలాంటి గుర్తింపు ఉండదు. దాంతో ఆ గ్రామ ప్రజలను సమాజం చిన్నచూపు చూస్తూ ఉంటుంది. ఆ గ్రామంలోనే జన్మించి పెరిగిన యువకుడు పెద్ది (రామ్‌ చరణ్‌). జీవనోపాధి కోసం ప్రతిరోజూ విజయనగరానికి వెళ్లి కూలి పనులు చేస్తుంటాడు. వృత్తిరీత్యా కూలీ అయినప్పటికీ, క్రికెట్‌లో మాత్రం అసాధారణ ప్రతిభ కనబరుస్తాడు. అతడి ఆటతీరుకు ముగ్ధులైన విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు పోటీపడతాయి.

వివరాలు

కథ సాగుతుందిలా..

ముఖ్యంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగల బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన పెద్ది, అందరికీ 'ఆట కూలీ'గా గుర్తింపు పొందుతాడు. అలాంటి ప్రతిభావంతుడు క్రికెట్‌కు దూరమై కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్రకు పెద్ది జీవితంతో ఉన్న సంబంధం ఏమిటి? తన గ్రామానికి గుర్తింపు తీసుకురావడానికి, అక్కడి ప్రజల గౌరవం కోసం పెద్ది చేసిన పోరాటం ఎలా సాగింది? అనే అంశాల చుట్టూనే సినిమా కథ ముందుకు సాగుతుంది.

Advertisement