Pakistan Hockey Team: హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ జాతీయ క్రీడ హకీకి తీవ్ర అవమానం ఎదురైంది. నిధుల కొరతతో పాటు సమాఖ్య నిర్వాకం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ హాకీ జట్టు గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో యాజమాన్యం బుకింగ్‌ను రద్దు చేయడం ఈ దుస్థితికి దారితీసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ టోర్నీలో పాల్గొనేందుకు జట్టు ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాకు చేరుకుంది. అయితే జట్టు బస చేయాల్సిన నాలుగు నక్షత్రాల హోటల్‌కుPakistan Hockey Federation (PHF)చెల్లింపులు చేయలేదు. దీంతో హోటల్ యాజమాన్యం ముందస్తుగా చేసిన బుకింగ్‌ను రద్దు చేసింది. ఈ విషయం తెలియక హోటల్‌కు చేరుకున్న ఆటగాళ్లు, అధికారులు తమకు గదులు లేవని తెలిసి షాక్‌కు గురయ్యారు.
Details
పరిమిత సంఖ్యలో గదుల కేటాయింపు
పరిస్థితిని సరిచేయడానికి జట్టు హెడ్ కోచ్ తాహిర్ జమాన్, పాకిస్థాన్‌లోని PHF, పిఎస్‌బి అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూసిన తర్వాత, హోటల్ యాజమాన్యంతో చర్చలు జరిపి పరిమిత సంఖ్యలో గదులు పొందగలిగారు. దీంతో ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు సర్దుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి జట్టు వసతి కోసం పీఎస్‌బీ ఇప్పటికే పీహెచ్‌ఎఫ్‌కు సుమారు 49,000డాలర్ల నిధులు విడుదల చేసినట్లు సమాచారం. అయినప్పటికీ బిల్లు చెల్లించకపోవడం ఫెడరేషన్ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. ఈ గందరగోళం జరిగిన మరుసటి రోజే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ పరాజయం పాలవడం గమనార్హం.