Pakistan: ఇండియా మ్యాచ్‌కు నో చెప్పిన పాక్.. టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కీలక అంశాలను వెల్లడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు శ్రీలంకకు ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఫిబ్రవరి 15, 2026న భారత్‌తో షెడ్యూల్ అయిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మైదానంలోకి దిగదని స్పష్టం చేసింది.
Details
ఈ అంశంపై ఇంకా స్పందించని ఐసీసీ
ఈ మ్యాచ్‌ను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వ ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి కీలక మ్యాచ్‌ను పాకిస్థాన్ ఆడకపోవడం టోర్నీపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై ఐసీసీ, నిర్వాహక దేశాలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.