చంద్రబాబు నాయుడు: వార్తలు
23 Feb 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీచంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
18 Feb 2023
నారా లోకేశ్కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.
03 Feb 2023
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఫోన్ ట్యాపింగ్: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరువర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.
02 Feb 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీపాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
27 Jan 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీకుప్పంలో లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు.
17 Jan 2023
నందమూరి బాలకృష్ణరేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు
తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు.
12 Jan 2023
ఆంధ్రప్రదేశ్జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
09 Jan 2023
తెలంగాణనిజామాబాద్పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.
05 Jan 2023
ఆంధ్రప్రదేశ్కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
04 Jan 2023
ఆంధ్రప్రదేశ్కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.
03 Jan 2023
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం
రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
02 Jan 2023
ఆంధ్రప్రదేశ్చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్‌నగర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
30 Dec 2022
వై.ఎస్.జగన్పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
29 Dec 2022
ఆంధ్రప్రదేశ్కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
26 Dec 2022
ఆంధ్రప్రదేశ్చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్చల్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.
23 Dec 2022
తెలంగాణతెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
23 Dec 2022
ఆంధ్రప్రదేశ్టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
20 Dec 2022
వై.ఎస్.జగన్మూడు రాజధానులు V/S ఒక రాజధాని..!
ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.
20 Dec 2022
భారతదేశంగూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ ట్విటర్ వేదికగా తెలిపారు. పిచాయ్‌తో అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.
20 Dec 2022
భారతదేశంఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ.. వచ్చేఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో జరగనన్ను ఎలక్షన్లపై ఫోకస్ పెట్టింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 2023 ప్రారంభంలో.. మిజోరాంలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.