Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 10, 2026
12:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, బిల్లుకు సంబంధించిన ముఖ్య అంశాలపై సీఎం వివరంగా మాట్లాడినట్లు తెలిసింది. బడ్జెట్ రెండో దశ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి బిల్లును సభ ముందుకు తీసుకురావాలని అమిత్ షాను చంద్రబాబు కోరినట్లు సమాచారం. అంతేకాకుండా, రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా కేంద్ర హోంమంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.