Loading...
Michigan: మిషిగన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
మిషిగన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

Michigan: మిషిగన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు. డెట్రాయిట్‌కు సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని మిస్సాకీ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాద్‌ హిక్‌మన్‌ (39) అనే వ్యక్తి తొలుత కాల్పులకు తెగబడి 16 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల వ్యక్తి, 40 ఏళ్ల మహిళను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి మరో ప్రాంతానికి వెళ్లి కాల్పులు జరిపాడు. అక్కడ హిక్‌మన్‌తోపాటు 53 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల మహిళ మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులందరి శరీరాలపై బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాలికను వేధించిన కేసులో హిక్‌మన్‌కు 2024లో శిక్ష పడినట్లు సమాచారం.

వివరాలు

వర్జీనియా స్టేట్‌ యూనివర్సిటీలోనూ కాల్పులు

అమెరికాలోని వర్జీనియా స్టేట్‌ యూనివర్సిటీలో శనివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. అయితే గాయపడిన వారు ఎవరన్న వివరాలను అధికార వర్గాలు, పోలీసులు వెల్లడించలేదు.

కాల్పుల్లో గాయపడిన వారికి విశ్వవిద్యాలయంతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కూడా అధికారులు స్పష్టం చేయలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT