Aadarsha Kutumbam: వెంకటేశ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ వాయిదా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 05, 2026
04:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయకుడు వెంకటేష్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయన కీలక పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47' (Aadarsha Kutumbam House No. 47) విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. తొలుత ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం అక్టోబరు 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనే విషయంపై చిత్ర బృందం నిర్ణయం తీసుకోనుంది.