కాంగ్రెస్: వార్తలు
31 Mar 2023
పంజాబ్పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1న, పాటియాలా జైలు నుండి విడుదల కానున్నారు. అతని అధికారిక హ్యాండిల్ నుండి విడుదల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ విడుదల అయింది,
30 Mar 2023
కర్ణాటకKarnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీఎం కుర్చి కోసం పోటీ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మందే సీనియర్ నాయకులు సీఎం అభ్యర్థిగా తామంటే తాము అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య నెలకొంది.
28 Mar 2023
రాహుల్ గాంధీఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ
లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
28 Mar 2023
రాహుల్ గాంధీరాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు కేటాయించిన దిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
28 Mar 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టు కేసును తాము నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.
27 Mar 2023
రాహుల్ గాంధీప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ
అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రజల సొమ్మును ప్రధాని మోదీ పెట్టుబడిగా పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
27 Mar 2023
బ్రిటన్'రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం'; లండన్‌లో కాంగ్రెస్ నిరసన
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
26 Mar 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు
రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హుత వేటు వేడయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'సత్యాగ్రహ' దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
25 Mar 2023
రాహుల్ గాంధీశాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో సూరుత్ కోర్టు తీర్పు, లోక్‌సభలో అనర్హత వేటు, అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
25 Mar 2023
కర్ణాటకKarnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది.
24 Mar 2023
రాహుల్ గాంధీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
24 Mar 2023
సుప్రీంకోర్టుఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.
24 Mar 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
21 Mar 2023
రాహుల్ గాంధీకేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
21 Mar 2023
బీజేపీకాంగ్రెస్లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.
20 Mar 2023
మమతా బెనర్జీరాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ
కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
19 Mar 2023
కర్ణాటకఅసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి.
17 Mar 2023
బీజేపీనెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు.
17 Mar 2023
రాహుల్ గాంధీలండన్లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్లో జరుగుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం కూడా గందరగోళంగా మారాయి. లండన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్‌కు నోటీసును అందచేశారు.
13 Mar 2023
మల్లికార్జున ఖర్గేప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఇటీవల లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
11 Mar 2023
బీజేపీరాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.
11 Mar 2023
బీజేపీబీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
07 Mar 2023
రాహుల్ గాంధీ'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం
భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
06 Mar 2023
రాహుల్ గాంధీచైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
లండన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో, పార్లమెంటులో ప్రతిపక్ష మాట్లాడనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
04 Mar 2023
రేవంత్ రెడ్డిరేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఈ ఘటన జరిగింది.
04 Mar 2023
బీజేపీ'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం దేశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది.
03 Mar 2023
రాహుల్ గాంధీభారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ
భారత ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. '21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం' అనే అంశంపై కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్లోని ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.
02 Mar 2023
అసెంబ్లీ ఎన్నికలుఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్పీపీ
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయకేతాన్ని ఎగురవేశాయి.
28 Feb 2023
కర్ణాటకకర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని రాజకీయ పక్షాలను ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసి మార్గంలో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి.
27 Feb 2023
తెలంగాణD Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
26 Feb 2023
రాహుల్ గాంధీCongress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
25 Feb 2023
ఛత్తీస్‌గఢ్Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో శనివారం యూపీఏ చైర్పర్సన్, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్క రాజ్యాంగ సంస్థను బీజేపీ-ఆర్ఎస్ఎస్లు నాశనం చేశాయని ఆరోపించారు.
25 Feb 2023
ఛత్తీస్గఢ్కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండోరోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గైర్హాజరైన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం ప్లీనరీలో పాల్గొన్నారు.
24 Feb 2023
ఛత్తీస్గఢ్కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక బాడీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు.
24 Feb 2023
నాగాలాండ్మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
24 Feb 2023
సోనియా గాంధీకాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం.
19 Feb 2023
సోనియా గాంధీఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?
ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
18 Feb 2023
చంద్రబాబు నాయుడుకేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.
16 Feb 2023
బీజేపీబీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
16 Feb 2023
త్రిపురత్రిపుర అసెంబ్లీ పోలింగ్: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటేస్తున్న ప్రజలు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. 28.14లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 60స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 259 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.