Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
కుంభమేళా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలకు హాజరు కాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింతగా ముదిరాయి.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది.
ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలపై నేరుగా విమర్శలు చేస్తూ, వారు హిందూ వ్యతిరేకులని ఆరోపించింది.
బీజేపీ విమర్శలు
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తోంది. బాబ్రీ మసీదుకు మూడుసార్లు వెళ్లిన రాహుల్ గాంధీ, రాముడి ఆలయాన్ని మాత్రం సందర్శించలేదు.
ఆయన తరచుగా రాయ్‌బరేలికి వెళ్తారు. 120 కి.మీ దూరంలో ఉన్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు మాత్రం హాజరుకాలేకపోయారని వ్యాఖ్యానించారు.
Details
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
ఇదే సమయంలో బీజేపీ మరో విమర్శ చేస్తూ, శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మితమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జనవరి 22, 2024న రామ్‌లాలా ప్రాణ ప్రతిష్ట జరిగింది.
కానీ ఆలయ నిర్మాణానికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆహ్వానం అందుకున్నా వేడుకకు హాజరుకాలేదు.
వారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేసింది.
Details
కాంగ్రెస్ కౌంటర్
బీజేపీ విమర్శలపై మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉప సీఎం అజిత్ పవార్, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వంటి బీజేపీ మిత్రపక్ష నేతలు కూడా కుంభమేళాకు హాజరుకాలేదు.
వీరిని కూడా హిందూ వ్యతిరేకులుగా పరిగణిస్తారా? అంటూ ప్రశ్నించారు.
బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఈ మాటల తూటాలు పెరుగుతున్న తరుణంలో, భవిష్యత్తులో మరిన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగే అవకాశం ఉంది.