Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?.. అసలు నిజం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ముఖ్యంగా పవన్‌కు తమ్ముడి పాత్రలో విజయ్ నటిస్తాడని వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున హల్‌చల్ చేశాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలుసుకునే ప్రయత్నంలో తాజా సమాచారం బయటకొచ్చింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని స్పష్టమైంది.
Details
బిజీ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ
పవన్ సినిమాకు సంబంధించి విజయ్‌ను సంప్రదించారన్న వార్తలు పూర్తిగా పుకార్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూర్తిగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన నాలుగు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రౌడీ జనార్దన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే సెట్స్‌పై ఉంది. అలాగే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పిరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి' కూడా షూటింగ్ దశలో కొనసాగుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు షూటింగ్ స్టేజ్‌లో ఉండటంతో, విజయ్ తన సమయాన్ని పూర్తిగా తన సొంత ప్రాజెక్టులకే కేటాయిస్తున్నాడు.
Details
అభిమానులకు కొంత నిరాశే
ఇలాంటి పరిస్థితుల్లో మరో సినిమాకు, అదీ ఒక క్రేజీ మల్టీస్టారర్ అయినా లేదా అతిథి పాత్ర అయినా సరే, డేట్స్ సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. అందువల్ల పవన్ సినిమా కోసం విజయ్‌ను తీసుకుంటున్నారన్న ప్రచారానికి వాస్తవాధారం లేదని స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్-విజయ్ దేవరకొండ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని ఆశించిన అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే అంశమే. అయితే విజయ్ ప్రస్తుతం చేస్తున్న సోలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను కలిగి ఉండటంతో, ఆయన ఫోకస్ పూర్తిగా వాటిపైనే కొనసాగుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.