Loading...
Actress Ranya Rao: నటి రన్యారావుకు భారీ షాక్.. బంగారం స్మగ్లింగ్ కేసులో రూ.89 కోట్ల జరిమానా
నటి రన్యారావుకు భారీ షాక్.. బంగారం స్మగ్లింగ్ కేసులో రూ.89 కోట్ల జరిమానా

Actress Ranya Rao: నటి రన్యారావుకు భారీ షాక్.. బంగారం స్మగ్లింగ్ కేసులో రూ.89 కోట్ల జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావుకు కస్టమ్స్‌ శాఖ భారీ జరిమానా విధించింది. ఈ కేసులో ఆమెకు రూ.89కోట్ల పెనాల్టీ విధిస్తూ కస్టమ్స్‌ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కస్టమ్స్‌ జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించి 399 పేజీల దర్యాప్తు నివేదికను కూడా అధికారులు విడుదల చేశారు. కస్టమ్స్‌ దర్యాప్తు ప్రకారం.. 2024 మార్చి 7 నుంచి 2025 ఫిబ్రవరి 18మధ్య కాలంలో రన్యారావు,ఆమె సహచరుడు తరుణ్‌తో పాటు మరో ముగ్గురు కలిసి విదేశాల నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మొత్తం 113కిలోల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వివరాలు 

2025 మార్చి 3న వెలుగులో కేసు 

ఈ కేసు 2025 మార్చి 3న వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఆమె వద్ద సుమారు 14 కిలోల బంగారం గుర్తించినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.

అనంతరం ఈ వ్యవహారంపై సీఓఎఫ్‌ఈపీఓఎస్‌ఏ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లిన కస్టమ్స్‌ అధికారులు.. రన్యారావుతో పాటు మరో నలుగురికి ఈ అక్రమ రవాణా వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

విదేశాల నుంచి బంగారం తీసుకురావడం, దాని రవాణా తదితర అంశాలపై అధికారులు వివరాలను సేకరించి దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు.

వివరాలు 

ఈ ఏడాది ఫిబ్రవరిలో రన్యారావుకు బెయిల్

ఇదిలా ఉండగా.. ఈ కేసులో రన్యారావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే తాజాగా కస్టమ్స్‌ శాఖ నుంచి భారీ జరిమానా ఉత్తర్వులు వెలువడ్డాయి.

రూ.89 కోట్ల జరిమానా విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రన్యారావుకు విధించిన భారీ జరిమానాపై కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే స్పందించారు.

ఈ పెనాల్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తనకు ప్రస్తుతం తెలియవని ఆయన చెప్పారు.

ఈ అంశంపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని బెంగళూరులో మీడియాతో పేర్కొన్నారు.

ADVERTISEMENT