రాహుల్ గాంధీ: వార్తలు
23 Mar 2023
సూరత్'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.
21 Mar 2023
లోక్సభకేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
20 Mar 2023
మమతా బెనర్జీరాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ
కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
17 Mar 2023
కాంగ్రెస్నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు.
17 Mar 2023
లోక్సభలండన్లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్లో జరుగుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం కూడా గందరగోళంగా మారాయి. లండన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్‌కు నోటీసును అందచేశారు.
15 Mar 2023
స్మృతి ఇరానీలండన్లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది.
13 Mar 2023
మల్లికార్జున ఖర్గేప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఇటీవల లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
07 Mar 2023
బీజేపీ'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం
భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
06 Mar 2023
కాంగ్రెస్చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
లండన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో, పార్లమెంటులో ప్రతిపక్ష మాట్లాడనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
04 Mar 2023
బీజేపీ'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం దేశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది.
03 Mar 2023
కాంగ్రెస్భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ
భారత ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. '21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం' అనే అంశంపై కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్లోని ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.
26 Feb 2023
ఛత్తీస్‌గఢ్Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
24 Feb 2023
కాంగ్రెస్కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక బాడీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు.
24 Feb 2023
కాంగ్రెస్కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం.
19 Feb 2023
కాంగ్రెస్ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?
ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
09 Feb 2023
నరేంద్ర మోదీగాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు.
08 Feb 2023
కాంగ్రెస్ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ
ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే లేఖ రాశారు.
07 Feb 2023
గౌతమ్ అదానీఅదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.
06 Feb 2023
అదానీ గ్రూప్అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు.
04 Feb 2023
నరేంద్ర మోదీ'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్
జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
30 Jan 2023
జమ్ముకశ్మీర్నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారంతో మూగియనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా పూర్తి చేసుకొన్నయాత్ర శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో గల చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో అధికారికంగా ముగియనుంది.
28 Jan 2023
జమ్ముకశ్మీర్'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు.
27 Jan 2023
కాంగ్రెస్సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'
2016లో భారత దళాలు జరిపిన సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్‌కు మరో హస్తం పార్టీ నాయకుడు రషీద్ అల్వీ మద్దుతుగా నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
24 Jan 2023
జమ్ముకశ్మీర్'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.