LOADING...
BJP: దేశ వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. 2024 రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ ఫైర్.. 
2024 రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ ఫైర్..

BJP: దేశ వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. 2024 రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ ఫైర్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారత వ్యతిరేక బృందాలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ, ఆయన యూఎస్ చట్టసభ్యురాలు జానిస్ షాకోవ్స్కీ‌తో ఆయన ఉన్న ఫోటోను ప్రస్తావించింది. ఈ ఫోటోను ప్రస్తావిస్తూ, షాకోవ్స్కీ 2020 ఢిల్లీలోని మత అల్లర్ల కేసులో నిందితుడైన ఉమర్ ఖాలీద్‌కి అనుకూలంగా ఒక లేఖపై సంతకం చేశారు. ఆమె ఉమర్ ఖాలీద్‌ను జైలులోనుండి విడుదల చేయాలని, మరో ఏడుగురితో కలిసి లేఖకు సంతకం చేశారు.

వివరాలు 

బీజేపీ విమర్శలపై స్పందించని రాహుల్, కాంగ్రెస్ పార్టీ

ఈ సంబంధాలను హైలెట్ చేస్తూ , బీజేపీ నేత ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ యాంటీ-ఇండియా నేతలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఫోటోలో రాహుల్ గాంధీ షాకోవ్స్కీ, ఇల్హాన్ ఒమర్తో ఉన్నారు. ఇల్హాన్ ఒమర్ తీవ్ర భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతుదారు, పలు సందర్భాల్లో జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం ద్వారా "భారతదేశాన్ని బలహీనపరచాలని, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను సులభంగా నీరుగార్చాలని ప్రయత్నించే వ్యక్తులు రాహుల్ గాంధీ చుట్టూ చేరుతారు" అని అన్నారు. అయితే, బీజేపీ విమర్శలపై రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.

వివరాలు 

ఢిల్లీలోని అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్

జానిస్ షాకోవ్స్కీ అంతర్జాతీయ ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి కొత్త చట్టాలు తీసుకురావాలని, భారతదేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారని.. ఇటీవల, డిసెంబర్ 30న జానిస్ షాకోవ్స్కీతో పాటు మరో ఏడుగురు అమెరికా శాసనసభ్యులు ఉమర్ ఖాలిద్‌కి బెయిల్ ఇవ్వాలని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలని భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. లేఖలో ఉమర్ ఖాలిద్‌పై ఉగ్రవాద ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సందేహాస్పదమని, మానవ హక్కుల సంస్థలు కూడా అతడిని ఉగ్రవాదానికి సంబంధిపెట్టలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కీ సూత్రధారిగా ఉన్నాడు, ఐదేళ్లుగా జైలు లో ఉన్నాడు. ప్రస్తుతం, అతడి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ పూర్తై, తీర్పు రిజర్వ్‌లో ఉంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రదీప్ భండారీ చేసిన ట్వీట్ 

Advertisement