తమిళనాడు: వార్తలు
22 Mar 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం
తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు.
09 Mar 2023
బీజేపీTamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే
తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.
09 Mar 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేతమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!
తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.
27 Feb 2023
అసెంబ్లీ ఎన్నికలుAssembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
25 Feb 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ
ఏఐఏడీఎంకేలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు, పార్టీ మాజీ నేత వీకే శశికళ స్పందించారు. అన్నాడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదని, పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తానని చెప్పారు.
15 Feb 2023
ఎన్ఐఏఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
13 Feb 2023
శ్రీలంక'ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్
తమిళ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
07 Feb 2023
సుప్రీంకోర్టుమద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
02 Feb 2023
హైకోర్టుముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు
ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది.
18 Jan 2023
ఎం.కె. స్టాలిన్తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి
తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.
11 Jan 2023
గవర్నర్సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
06 Jan 2023
ఎలక్ట్రిక్ వాహనాలు15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక
దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 'ఓలా ఎలక్ట్రిక్స్ 'ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో ఈ పార్క్ ఏర్పాటుకు సుమారు 1500 ఎకరాల భూమిని కొనుగోలు చేయబోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
24 Dec 2022
భారతదేశంఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.