Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు భక్తులు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. రామనాథపురం జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రామేశ్వరం నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న భక్తుల కారును మరో కారు వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని గుర్తించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు కార్లు తీవ్రంగా నజ్జునజ్జు అయ్యేంతగా ఢీకొన్నట్లు అక్కడి దృశ్యాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.