గ్యాస్: వార్తలు

11 May 2023

ఇటలీ

ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు 

ఉత్తర ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి.

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర

19కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. మే 1 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.

నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా

గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి.

వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. ఏప్రిల్ 1నుంచి తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.