Gas Cylinder Price: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాలని నిర్ణయించాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి దేశంలోనే వివిధ నగరాల్లో రూ.6.50 నుంచి 9 వరకు పెంచినట్లు తెలిసింది. ఇక 19కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.7.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధర పెంపు కారణంగా దిల్లీలో సిలిండర్ ధర రూ.1653. 50 కు చేరుకుంది. మరోవైపు హైదరాబాద్ లో రూ.1896 గా ఉంది.
గ్యాస్ సిలిండర్ ను రూ.500కే అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
పెద్ద సిలిండర్ కోసం ముంబై ప్రజలు నేటి నుంచి రూ.1605 చెల్లించాలి. చైన్నైలో బ్లూ సిలిండర్ ధర రూ. 1,817కు చేరుకుంది. గృహా అవసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. గత నెల జూలై 01న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర సూమారు రూ.30 వరకు తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్‌ను ప్రభుత్వం రూ.500కే అందిస్తున్న విషయం తెలిసిందే.