LOADING...
PM Modi: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా తగ్గింపు
భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా తగ్గింపు

PM Modi: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా తగ్గింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని పేర్కొంది. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించడంతో వ్యాపార వర్గాల్లో ఊరట వ్యక్తమైంది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్‌ అంగీకరించినట్లు అమెరికా వెల్లడించింది. భవిష్యత్తులో అమెరికా నుంచి ఇంధనం, గ్యాస్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని భారత్‌ నిర్ణయించినట్లు తెలిపింది. మొత్తం 500 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ అంగీకరించినట్లు స్పష్టం చేసింది.

Details

అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధం

ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక రంగాల్లో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ మధ్యంతర ఒప్పందం విజయవంతమైతే, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య పరస్పర సుంకాలను పూర్తిగా తొలగించే దిశగా అడుగులు వేయనున్నట్లు అమెరికా అంగీకరించింది. ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను సున్నా శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, వైన్‌ వంటి ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా రద్దు చేయనుంది. మరోవైపు, అమెరికా జెనరిక్‌ మందులు, విమాన భాగాలు, రత్నాలు, వజ్రాలపై ఉన్న సుంకాలను తొలగించేందుకు అంగీకరించినట్లు తెలిపింది.

Advertisement