Loading...
Glasgow Restaurant: భారత మ్యాప్‌ వివాదం.. ఎట్టకేలకు గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణలు
భారత మ్యాప్‌ వివాదం.. ఎట్టకేలకు గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణలు

Glasgow Restaurant: భారత మ్యాప్‌ వివాదం.. ఎట్టకేలకు గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఉన్న 'మిస్టర్ సింగ్స్ ఇండియా' (Glasgow Restaurant) రెస్టారెంట్‌ నాప్‌కిన్‌లపై అసంపూర్తి భారత మ్యాప్‌ను ముద్రించిన వివాదంపై ఎట్టకేలకు స్పందించింది. భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్ (Indian boxer Lovlina Borgohain)తో పాటు భారత అథ్లెట్లు ఈ తప్పిదాన్ని గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత బాక్సింగ్ ఫెడరేషన్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదం ముదరడంతో రెస్టారెంట్‌ అధికారికంగా క్షమాపణలు చెబుతూ, తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డిలీట్‌ చేసింది. అంతేకాకుండా, తప్పుగా ఉన్న లోగోను కూడా మార్చనున్నట్లు ప్రకటించింది.

వివరాలు

ఇది తమ పొరపాటే

రెస్టారెంట్‌ విడుదల చేసిన ప్రకటనలో మిస్టర్ సింగ్స్ ఇండియా*గా భారతీయ వారసత్వం పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంది.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని, అయితే భారత మ్యాప్‌ను (Incorrect Map) తప్పుగా చూపించడం పూర్తిగా తమ పొరపాటేనని అంగీకరించింది.

ఈ తప్పిదం ద్వారా ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ, వెంటనే సరిదిద్దే చర్యలు చేపడతామని తెలిపింది.

సరైన భారత మ్యాప్‌తో కొత్త లోగోను రూపొందిస్తామని, కామన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించిన భారత అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం తమకు గౌరవకరమైన విషయమని, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రకటనలో పేర్కొంది.

వివరాలు

అసలు ఏం జరిగింది?

ఇటీవల గ్లాస్గోలోని ఈ రెస్టారెంట్‌కు భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్‌తో పాటు పలువురు భారత అథ్లెట్లు డిన్నర్‌కు వెళ్లారు.

అక్కడ ఉపయోగిస్తున్న హ్యాండ్ టవల్స్‌ (నాప్‌కిన్‌లు)పై ముద్రించిన భారత మ్యాప్‌ను లవ్లీనా గమనించగా, అందులో ఈశాన్య రాష్ట్రాలు (North East)తో పాటు కశ్మీర్‌ ప్రాంతం సరిగా చూపించలేదని గుర్తించారు.

దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లవ్లీనా తన పోస్టులో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించవద్దు.

అది చూసి నాకు చాలా బాధ కలిగింది. మన ఈశాన్య రాష్ట్రాలు లేకుండా ఉన్న మ్యాప్‌ను చూడటం బాధాకరం.

ADVERTISEMENT

వివరాలు

అన్ని తప్పులను సరిచేస్తామని హామీ

అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా అదే విషయం నన్ను కలిచివేసింది. దయచేసి ఈ తప్పును వెంటనే సరిదిద్దండి అని విజ్ఞప్తి చేశారు.

ఆమె వ్యాఖ్యలతో ఈ విషయం విస్తృత చర్చకు దారి తీసింది.

అనంతరం రెస్టారెంట్‌ క్షమాపణలు చెబుతూ, లోగోతో పాటు అన్ని తప్పులను సరిచేస్తామని హామీ ఇచ్చింది.

ADVERTISEMENT