Hyderabad: జీహెచ్‌ఎంసీ విభజన ప్రభావం.. 6 జోన్లతో గ్రేటర్ హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
రాజధానిలో ఇక గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది. ప్రస్తుతం 300 డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లుగా విభజించనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్ల నిర్మాణం, వాటి పేర్లు, జనాభా పంపకం వంటి అంశాలపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీకాలం ముగియనుండటంతో భవిష్యత్‌లో నగర పరిపాలన ఎలా సాగనుందన్న అంశంపై చర్చ జరుగుతోంది.
Details
17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన
నగరంలో 17 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలన రానుంది. పాలకమండలి లేకపోతే మేయర్‌కు సమాన హోదాతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి స్థానిక సంస్థల పరిపాలనను నిర్వహిస్తుంది. చివరి సారిగా 2008 సెప్టెంబరు 4 నుంచి 2009 డిసెంబరు 4 వరకు ఎస్.పీ.సింగ్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, ప్రత్యేక అధికారిగా పరిపాలన చేపట్టారు. అంతకుముందు 12 మున్సిపాలిటీలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసి జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేసిన సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌కు తొలి కమిషనర్, ప్రత్యేక అధికారిగా సీవీ.ఎస్.కె. శర్మను నియమించారు. ఆయన 2007 ఏప్రిల్ 16 నుంచి 2008 సెప్టెంబరు 4 వరకు బాధ్యతలు నిర్వహించారు.
Details
జనాభా 1.34 కోట్లు
పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు కోటి మంది జనాభా ఉండేది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో జనాభా 1.34 కోట్లకు చేరింది. అప్పట్లో 150డివిజన్లు ఉండగా, డివిజన్ల పునర్విభజన అనంతరం వాటి సంఖ్య 253కు పెరిగింది. పాత నగర ప్రాంతంలో జనాభా అధికంగా ఉండటంతో డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో విలీనమైన 27పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జనాభా మాత్రం అంతంతమాత్రమే. పాత గ్రేటర్‌తో పోలిస్తే ఈ స్థానిక సంస్థల విస్తీర్ణం రెట్టింపు కాగా, జనాభా సుమారు 30 లక్షల వరకే ఉంది. వాటి పరిధిలో మొత్తం 47 డివిజన్లు ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబరు 3న జీహెచ్‌ఎంసీ 12జోన్లు, 60సర్కిళ్లు, 300డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది.
Details
ప్రభుత్వ ఉద్దేశం ఇదే
ప్రస్తుత జీహెచ్‌ఎంసీని సుమారు 70 లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సగటున 35 లక్షల జనాభా ఉండేలా మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను మూడు జోన్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.
Details
మూడు కార్పొరేషన్ల నిర్మాణం
జీహెచ్‌ఎంసీ జోన్లు శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ మల్కాజిగిరి కార్పొరేషన్ (ఎంఎంసీ) మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ సైబరాబాద్ కార్పొరేషన్ (సీఎంసీ) కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్