తదుపరి వార్తా కథనం

Hyderabad: కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురు పరిస్థితి విషమం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 14, 2023
02:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
బేకరీ కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
గాయపడ్డవారిని బేకరీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Details
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : సీఎం
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.
క్షతగ్రాతుల్లో ఎక్కువగా యూపీకిచెందిన వారే ఉన్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ప్రమాద ఘటనపై పలువురు రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.