
Commercial LPG: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచి అమల్లోకి
ఈ వార్తాకథనం ఏంటి
హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ సంస్థలు రూ.33.50 మేర తగ్గించాయి. ఈ తగ్గింపు కొత్తగా ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.తగ్గించిన రేటు ప్రకారం,దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1631.50కి చేరింది. అయితే,గృహ అవసరాల కోసం వినియోగించే 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చిన్న స్థాయి వ్యాపారాలపై ఈధర తగ్గింపు కొంత మేర ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రూ . 33.50 తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
Commercial LPG Cylinder Price Cut By Rs 33.50; New Rates Effective From Today #Cylinder #LPG #TNCards pic.twitter.com/sQJsGNcCGV
— TIMES NOW (@TimesNow) August 1, 2025