Page Loader
ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి
ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి

ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది మరణించారని, దాదాపు 300 మంది గాయపడ్డారని నగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం తెలిపారు. కొన్ని రోజులుగా ఆర్మేనియా దళాలపై అజర్‌బైజాన్‌ దళాలు దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మేనియా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఈ సమయంలో ఓ గ్యాస్‌స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో నష్టం ఎక్కవ జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గ్యాస్‌స్టేషన్‌ పేలిన వెంటనే 13మంది అక్కడిక్కడే చనిపోయారు. ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

300 మందికి గాయాాలు