LOADING...
Pulwama Attack 2019: పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం
పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం

Pulwama Attack 2019: పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 14, 2019... దేశ చరిత్రలో మరచిపోలేని దుఃఖదినం. ఆ రోజు భారత్ 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఘోర ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యత వహించింది. 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్‌పుర (అవంతిపురా సమీపం) వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ రోజు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 2,547 మంది సిబ్బంది 60కి పైగా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.

Details

వీరమరణం పొందిన జవాన్లకు పుష్పాంజలి ఘటించే రోజు

ప్రధానంగా బస్సులతో కూడిన ఈ కాన్వాయ్ పుల్వామా చేరుకునే సరికి, పేలుడు పదార్థాలతో నిండిన కారు ఒక బస్సును ఢీకొట్టింది. వెంటనే భారీ పేలుడు సంభవించి, 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి, ఉగ్రవాదులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు నినదించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14ను భారత్‌లో 'బ్లాక్ డే'గా పాటిస్తూ, పుల్వామా వీరులను స్మరించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటే, భారత్‌లో మాత్రం వీరమరణం పొందిన జవాన్లకు పుష్పాంజలి ఘటించే రోజు‌గా మారింది. పుల్వామా ఘటన అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది.

Details

d

2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ప్రతిగా ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వైమానిక దళం జమ్మూ, కశ్మీర్‌లోకి చొరబడి దాడులకు యత్నించింది. ఈ సందర్భంగా భారత యుద్ధ విమానం 'మిగ్-21'కూలిపోగా, పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్ సైనికుల చేతికి చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో 2019మార్చి 1న ఆయనను విడుదల చేశారు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలను రద్దు చేసింది. అలాగే మనీలాండరింగ్‌పై పర్యవేక్షణ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) వద్ద పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని కోరింది. ఈ పరిణామాల వల్ల పాకిస్థాన్ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది.

Advertisement

Details

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లు

హెడ్ కానిస్టేబుల్ నసీర్ అహ్మద్ (జమ్మూ కశ్మీర్) కానిస్టేబుల్ సుఖ్జీందర్ సింగ్ (పంజాబ్) హెడ్ కానిస్టేబుల్ జైమల్ సింగ్ (పంజాబ్) కానిస్టేబుల్ రోహితాష్ లాంబా (రాజస్థాన్) కానిస్టేబుల్ తిలక్ రాజ్ (హిమాచల్ ప్రదేశ్) హెడ్ కానిస్టేబుల్ విజయ్ సోరెంగ్ (జార్ఖండ్) కానిస్టేబుల్ వసంత కుమార్ వివి (కేరళ) కానిస్టేబుల్ సుబ్రమణ్యం జి (తమిళనాడు) కానిస్టేబుల్ మనోజ్ కుమార్ బెహెరా (ఒడిశా) కానిస్టేబుల్ GD గురు హెచ్ (కర్ణాటక) హెడ్ కానిస్టేబుల్ నారాయణ్ లాల్ గుర్జార్ (రాజస్థాన్) కానిస్టేబుల్ మహేష్ కుమార్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ (ఉత్తరప్రదేశ్)

Advertisement

Details

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లు 1/2

హెడ్ కానిస్టేబుల్ హేమ్‌రాజ్ మీనా (రాజస్థాన్) హెడ్ కానిస్టేబుల్ పీకే సాహూ (ఒడిశా) కానిస్టేబుల్ రమేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) హెడ్ కానిస్టేబుల్ సంజయ్ రాజ్‌పుత్ (మహారాష్ట్ర) కానిస్టేబుల్ కౌశల్ కుమార్ రావత్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ శ్యామ్ బాబు (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ అజిత్ కుమార్ ఆజాద్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ మణిందర్ సింగ్ అత్రి (పంజాబ్) హెడ్ కానిస్టేబుల్ బబ్లూ సంత్రా (పశ్చిమ బెంగాల్) కానిస్టేబుల్ అశ్వని కుమార్ కావోచి (మధ్యప్రదేశ్) కానిస్టేబుల్ రాథోడ్ నితిన్ శివాజీ (మహారాష్ట్ర) కానిస్టేబుల్ భగీరథ్ సింగ్ (రాజస్థాన్)

Details

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లు 1/3

కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ (ఉత్తరాఖండ్) హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ రతన్ కుమార్ ఠాకూర్ (బీహార్) కానిస్టేబుల్ పంకజ్ కుమార్ త్రిపాఠి (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ జీత్ రామ్ (రాజస్థాన్) కానిస్టేబుల్ అమిత్ కుమార్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ విజయ్ కుమార్ మౌర్య (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్ (పంజాబ్) హెడ్ కానిస్టేబుల్ మణేశ్వర్ సుమతారి (అస్సాం) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ లాల్ (ఉత్తరాఖండ్) హెడ్ కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హా (బీహార్) హెడ్ కానిస్టేబుల్ రామ్ వకీల్ (ఉత్తరప్రదేశ్) కానిస్టేబుల్ సుదీప్ బిస్వాస్ (పశ్చిమ బెంగాల్) కానిస్టేబుల్ శివచంద్రన్ (తమిళనాడు)

Advertisement