జమ్ముకశ్మీర్: వార్తలు
01 Apr 2023
శ్రీనగర్మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు
శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
24 Mar 2023
ఫరూక్ అబ్దుల్లా'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్
రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
22 Mar 2023
భూకంపంఅఫ్గానిస్థాన్లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
22 Mar 2023
భూకంపంపాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
21 Mar 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
17 Mar 2023
గుజరాత్కిరణ్ పటేల్: పీఎంఓ అధికారినంటూ హల్చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ప్రధానమంత్రి కార్యాలయం( పీఎంఓ)అధికారిగా నటించి అడ్డంగా దొరికిపోయిన గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ను శుక్రవారం శ్రీనగర్ కోర్టు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
15 Mar 2023
ఉగ్రవాదులుజమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్
జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం బారాముల్లాలో లష్కరే తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదిని అరెస్టు చేశారు. గత 24గంటల్లో బారాముల్లాలో ఇది రెండో అరెస్ట్ అని పోలీసులు వెల్లడించారు.
14 Mar 2023
ఎన్ఐఏటెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.
11 Mar 2023
పాకిస్థాన్ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు.
20 Feb 2023
ఉగ్రవాదులుజమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మూడున్నరేళ్ల తర్వాత లోయలో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.
17 Feb 2023
భూకంపంజమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం
జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది.
13 Feb 2023
ఎన్నికల సంఘంజమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు 370కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభావం చూపదని ధర్మాసనం చెప్పింది.
10 Feb 2023
ప్రపంచంఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం
జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు.
10 Feb 2023
ప్రపంచంజమ్మూకాశ్మీర్లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు
దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
08 Feb 2023
మెహబూబా ముఫ్తీఅఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ
జమ్ముకశ్మీర్‌లో ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ పీడీపీ అగ్రనేత మెహబూబా ముఫ్తీ దిల్లీలో ఆందోళన చేప్టటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపై ఆమె విరుచుపడ్డారు. పేదలు, అట్టడుగువర్గాల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు జమ్ముకశ్మీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
04 Feb 2023
రాహుల్ గాంధీ'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్
జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
03 Feb 2023
ఉత్తరాఖండ్జమ్ముకశ్మీర్లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.
30 Jan 2023
రాహుల్ గాంధీనేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారంతో మూగియనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా పూర్తి చేసుకొన్నయాత్ర శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో గల చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో అధికారికంగా ముగియనుంది.
28 Jan 2023
రాహుల్ గాంధీ'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు.
24 Jan 2023
రాహుల్ గాంధీ'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.
23 Jan 2023
కాంగ్రెస్'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ దాడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
21 Jan 2023
భారతదేశంజమ్ముకశ్మీర్లో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. 15 నివిషాల వ్వవధిలోనే ఈ పేలుళ్లు జరగ్గా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నర్వాల్ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ నగర్‌లోని యార్డ్ నంబర్ 7లో ఈ పేలుళ్లు సంభవించాయి.
10 Jan 2023
భారతదేశం'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనేవి కశ్మీర్ ప్రజల హక్కు అన్నారు ఒమర్ అబ్దుల్లా. అయితే వాటిని నిర్వహంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడుక్కోరని చెప్పారు. కశ్మీరీ ప్రజలు బిచ్చగాళ్లు కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
03 Jan 2023
సుప్రీంకోర్టుసినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సినిమా హాళ్ల లోపల ఆహారం, పానీయాల అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే పూర్తి అర్హత యజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
02 Jan 2023
భారతదేశంరాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో మరో ఉగ్ర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే రాజౌరిలో మరో పేలుడు సంభవించడంతో కశ్మీర్ లోయలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
31 Dec 2022
భారతదేశం2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?
2022లో కశ్మీర్ లోయలో జరిగిన ఎన్కౌంటర్ల వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్లో మొత్తం 93 ఎన్కౌంటర్లు జరిగినట్లు పేర్కొన్నారు.
23 Dec 2022
భారతదేశంఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
టెర్రర్ ఫండింగ్‌తో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న వారి ఇళ్లపై శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని దాదాపు 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కొన్ని డిజిటల్ డివైజ్‌లు, సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు.