LOADING...
 J&K's Kulgam: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

 J&K's Kulgam: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ ప్రాంతంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది అని సమాచారం అందుతోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ముష్కరుల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కీలకమైన ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడైంది. తాజాగా సోమవారం జమ్ము-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. గుడార్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని స్పష్టమైన సమాచారం అందడంతో భద్రతా దళాలు మోహరించాయి. ఆ ఎదురుదాడిలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం వచ్చింది. అంతేగాక, ఒక ఆర్మీ జవాన్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

వివరాలు 

పాకిస్థాన్ కరెన్సీ నోట్లు స్వాధీనం

అలాగే, ఆదివారం అర్ధరాత్రి జమ్మూ ప్రాంతంలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్ దగ్గర అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక పాకిస్థాన్ చొరబాటుదారుడు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భద్రతా దళాలు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ చొరబాటుదారుడిని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధ జిల్లాలో నివాసి సిరాజ్ ఖాన్‌గా గుర్తించారు. రాత్రి 9:20 గంటల సమయంలో చొరబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంలో పాకిస్థాన్ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి, అతను భారతదేశంలోకి చొరబడటానికి గల ఉద్దేశ్యాలు, ఇతర విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కశ్మీర్ జోన్ పోలీస్ చేసిన ట్వీట్