సూర్యకుమార్ యాదవ్: వార్తలు

టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్

భారత్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అంతర్జాతీయ టీ20, వన్డేలో అదరగొట్టిన సూర్య.. ప్రస్తుతం టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.

ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సూర్యకుమార్ యాదవ్

సూర్య భాయ్.. ఇది పేరు కాదు! ఇట్స్ ఏ బ్రాండ్.. టీ20ల్లో ఈ బ్రాండ్ చేస్తున్న రీసౌండ్ మామూలుగా లేదు. గతేడాది చివరన ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం.1 ప్లేస్ ని దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తాజాగా మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.

అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా

పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత పోరాటం చేసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ (31బంతుల్లో 65; 3ఫోర్లు, 6 సిక్సర్లు) కొట్టి అందరి మనసులను దోచుకున్నారు. శ్రీలంక కెప్టెన్ షనక, అక్షర్‌ను ఛాతిపై తట్టి అభినందించాడు.

నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్

శ్రీలకంతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 బంతుల్లో 7 పరుగులు చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ 10 స్థానాలను మెరుగుపరుచుకొని 23 స్థానానికి, దీపక్ హుడా 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి

ఐసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన నిలిచారు. ఐసీసీఐ ప్రతిపాదించిన పురుషుల జాబితాలో సూర్య, మహిళల జాబితాలో స్మృతి మందాన చోటు దక్కించుకున్నారు.

నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్

టీ20లో విధ్వంసకర బ్యాట్య్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది మంచి జోష్ ఉన్నారు. టీమిండియాలో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక ఆట శైలి ఉందని నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.