LOADING...
Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ
ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ

Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది. ఈ గెలుపు అనంతరం భారత జట్టుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాడు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో జట్టు సభ్యులు,సపోర్ట్ స్టాఫ్ అందరికీ కలిసి భోజన విందు ఏర్పాటు చేశాడు. వరల్డ్ కప్ లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో ఆటగాళ్లు కాస్త రిలాక్స్ కావాలన్నదే గంభీర్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విందుకు సంబంధించిన వీడియోలను ఏఎన్‌ఐ విడుదల చేయగా,వాటిలో గంభీర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్,సపోర్ట్ స్టాఫ్ సభ్యులు రావడం కనిపించింది.

వివరాలు 

జట్టును కుటుంబంలా దగ్గర చేయాలన్న గంభీర్ ప్రయత్నం

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ డిన్నర్‌కు హాజరయ్యారు. ఇది కేవలం భోజన కార్యక్రమమే కాదు, జట్టును కుటుంబంలా దగ్గర చేయాలన్న గంభీర్ ప్రయత్నంగా జట్టు వర్గాలు చెబుతున్నాయి. ఇదే తొలిసారి కూడా కాదు. గతంలోనూ భారత జట్టు ఢిల్లీకి వచ్చిన సందర్భాల్లో, వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ సమయంలో కూడా గంభీర్ ఇలానే తన ఇంట్లో విందులు ఏర్పాటు చేసి, ఆటగాళ్ల మధ్య అనుబంధాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ విందుకు ముందు భారత్ ఓ కఠినమైన మ్యాచ్ నుంచి బయటపడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వివరాలు 

కుప్పకూలిన టాప్ ఆర్డర్

అయితే ఈ గెలుపు అంత ఈజీగా రాలేదు. టాప్ ఆర్డర్ పూర్తిగా కూలిపోవడంతో 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అటువంటి పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పోరాడాడు. తన హోమ్ గ్రౌండ్ వాంఖడేలో పరిస్థితిని చక్కదిద్దుతూ 49 బంతుల్లో నాటౌట్‌గా 84 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఒక దశలో భారత్ 18 ఓవర్లకు 128/7గా ఉండగా, చివరి వరకూ బాధ్యత తీసుకుని స్కోర్‌ను 161/9కి చేర్చాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో చూపించిన ఇన్నింగ్స్ ఇదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

వివరాలు 

మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన

బౌలింగ్‌లోనూ భారత్‌కు ఊరట లభించింది. జస్ప్రీత్ బుమ్రా అనారోగ్య కారణాలతో దూరమవడంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అతడి దాడికి అమెరికా జట్టు నాలుగో ఓవర్‌కే కుప్పకూలింది. అప్పుడే మ్యాచ్ భారత్ వైపునకు పూర్తిగా మళ్లింది. చివరకు తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గంభీర్ ఇంట్లో కుటుంబ వాతావరణం

Advertisement