Loading...
Trump: 'క్వైట్.. క్వైట్' అంటూ మహిళా జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర అసహనం
'క్వైట్.. క్వైట్' అంటూ మహిళా జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర అసహనం

Trump: 'క్వైట్.. క్వైట్' అంటూ మహిళా జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర అసహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో ఓ కార్యక్రమం సందర్భంగా ఓ మహిళా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఆమెను ప్రశ్న అడగకుండా అడ్డుకోవడంతోపాటు 'ఫేక్ న్యూస్', 'ఫేక్ రిపోర్టర్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోమవారం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఓ యువకుడిని సత్కరించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో సీఎన్ఎన్ ప్రతినిధి క్రిస్టెన్ హోమ్స్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించిన అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించారు.

వివరాలు 

దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాల తగ్గింపుపై ప్రశ్నించిన రిపోర్టర్

దక్షిణ కొరియాతో కలిసి అమెరికా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని కిమ్ ఎప్పుడైనా కోరారా? అని ఆమె అడిగారు.

ఈ ప్రశ్నతో ట్రంప్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. ''క్వైట్.. క్వైట్.. క్వైట్'' అంటూ ఆమెను మాట్లాడకుండా అడ్డుకున్నారు.

ఈ యువకుడి సమక్షంలో ఆమె చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అనంతరం ఆమె ఏ మీడియా సంస్థకు చెందినవారని ప్రశ్నించారు.

తాను సీఎన్ఎన్ ప్రతినిధినని ఆమె సమాధానం ఇవ్వడంతో ట్రంప్ మరింత ఘాటుగా స్పందించారు.

వివరాలు 

''ఫేక్ న్యూస్.. నువ్వు ఫేక్ రిపోర్టర్

''ఫేక్ న్యూస్.. నువ్వు ఫేక్ రిపోర్టర్. చాలా గట్టిగా అరుస్తావు. నిశ్శబ్దంగా ఉండు'' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత కూడా రిపోర్టర్ మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. అయితే ట్రంప్ ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.

దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అంతకుముందు కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

కిమ్ తన పట్ల గౌరవంగా వ్యవహరించారని చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో వాటిని తగ్గించినట్లు ట్రంప్ వివరించారు.

ఈ నిర్ణయం కొరియా ద్వీపకల్పంలో భద్రతను మరింత పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఎన్ఎన్ మహిళా రిపోర్టర్‌పై విరుచుకుపడిన ట్రంప్

ADVERTISEMENT