IND vs NZ : నాల్గో టీ20 మ్యాచ్‌లో.. ఓటమికి కారణాలను వెల్లడించిన సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ బుధవారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది. టాస్ ఓడిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 215 రన్స్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు డెవన్ కాన్వే 44, టీమ్ సీఫెర్ట్ 62 పరుగులు రాబట్టి బలమైన ఆరంభం అందించారు. భారీ లక్ష్యంతో బరిలోకి వచ్చిన భారత జట్టు కేవలం 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 50 రన్ తేడాతో విజయం సాధించింది.
వివరాలు
ఈ మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లతో ప్రయత్నం
మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓటమికి కారణాలను వివరించారు. "మనం ఈ మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లతో ప్రయత్నించాం. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం.అదే సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని అనుకున్నాం. 180-200 పరుగుల లక్ష్య సాధనలో ప్రారంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా మారుతుందో పరీక్షించాలనుకున్నాం. ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం. ప్రపంచకప్ జట్టులో ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకున్నాం. అందుకే ఇతర ఆటగాళ్లను ఆడించలేదు'' అని సూర్య చెప్పారు.
వివరాలు
జస్ర్పీత్ బుమ్రా మిస్ చేసిన క్యాచ్ వల్ల న్యూజిలాండ్ భారీ స్కోరు
"మ్యాచ్ సమయంలో కొంత మంచు ఉండటంతో రెండు లేదా మూడు భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే బాగుండేది. శివమ్ దూబే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసాడు. అతనికి తోడుగా ఇంకో బ్యాటర్ కొన్ని పరుగులు సాధిస్తే భారత్ విజయానికి మంచి అవకాశాలు ఉండేవి" అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఇది కాకుండా, నెటిజన్లు న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించడంలో భారత స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా మిస్ చేసిన క్యాచ్ ప్రధాన కారణం అని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఆకాశమేహద్దుగా చెలరేగిన టీమ్ సీఫెర్ట్
ఇన్నింగ్స్ ప్రారంభంలో టీమ్ సీఫెర్ట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బుమ్రా అందుకోలేకపోవడం, తరువాత ఆ మ్యాచ్‌లో కివీస్ రన్ రేట్ పెరగటానికి దారితీసింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో టీమ్ సీఫెర్ట్ షాట్ ఆడగా,షార్ట్ థర్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా వెనక్కి పరుగెత్తి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు,కానీ బంతి పట్టుకోలేక పోయాడు. ఆ తరువాత టీమ్ సీఫెర్ట్ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లోనే 62 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.