Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్ పరిస్థితి స్థిరంగా ఉంది.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్!
ఈ వార్తాకథనం ఏంటి
సిడ్నీ వన్డేలో క్యాచ్ పట్టే సమయంలో గాయపడ్డ భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం కారణంగా అభిమానులు ఆందోళన చెందుతుండగా, అతడి ఆరోగ్య స్థితిపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజా అప్‌డేట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో రేపు (బుధవారం) జరగనున్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతడికి ఫోన్ చేశాను. కానీ ఆ సమయంలో అతడి దగ్గర ఫోన్ లేకపోవడంతో ఫిజియోకు కాల్ చేశాను.
Details
ఆరోగ్యం నిలకడగా ఉంది
ఫిజియో ద్వారా తెలిసింది ఏమిటంటే, శ్రేయస్ పరిస్థితి స్థిరంగా ఉందని. మొదటి రోజు పరిస్థితి స్పష్టంగా చెప్పలేకపోయారు, కానీ ఇప్పుడు రెండు రోజులుగా నేను అతడితో మాట్లాడుతున్నాను. శ్రేయస్ ఫోన్‌లో రిప్లై ఇస్తున్నాడు అంటే అతడు బాగానే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు ప్రతిరోజూ అతన్ని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడని సూర్యకుమార్ వివరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. మొదటి టీ20 రేపు కాన్‌బెర్రాలో జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే.