Sunetra Pawar: అజిత్ పవార్ కుమారుడికి రాజ్యసభ టికెట్? రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అజిత్ పవార్ మరణానంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం వెలుగుచూస్తోంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ (Ajit Pawar son Parth) రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవార్ (Sunetra Pawar) త్వరలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
Details
మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన పార్థ్
ఈ నేపథ్యంలో ఆమె రాజ్యసభ స్థానాన్ని పార్థ్ పవార్‌తో భర్తీ చేయనున్నట్లు ఎన్సీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్థ్ పవార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఇప్పుడు రాజ్యసభ మార్గం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.