LOADING...
Donald Trump: శాంతి ప్రయత్నాలకు పుతిన్‌-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్
శాంతి ప్రయత్నాలకు పుతిన్‌-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్

Donald Trump: శాంతి ప్రయత్నాలకు పుతిన్‌-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. సంఘర్షణ ముగింపునకు సంబంధించి పురోగతి సాధిస్తున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలొదిమిర్‌ జెలెన్‌స్కీ (Zelensky), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin)ల మధ్య తీవ్ర వైరం ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 'వారు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఇది మా ప్రయత్నాలను కష్టతరం చేస్తోంది. అయినప్పటికీ, ఒక పరిష్కారానికి మేము చాలా దగ్గరగా ఉన్నామని భావిస్తున్నాను. యుద్ధం ముగిసే మంచి అవకాశం ఉందని నాకు అనిపిస్తోందని ఆయన చెప్పారు.

Details

ఇతర నగరాలపై దాడులు నిలివేయాలని కోరా : ట్రంప్

ఇదివరకే తీవ్ర శీతాకాల పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ (Ukraine) రాజధాని కీవ్‌తో పాటు ఇతర నగరాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని తాను పుతిన్‌ను కోరినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తికి రష్యా (Russia) అంగీకరించిందని కూడా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంలో భాగంగా రష్యా మరో కీలక అడుగు వేసింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించినట్లు రష్యా ప్రకటించింది. పుతిన్‌ సహాయకుడు యూరి ఉషాకోవ్‌ మాట్లాడుతూ.. జెలెన్‌స్కీ సమావేశానికి అంగీకరిస్తే మాస్కోలో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా, ఆహ్వానాన్ని స్వీకరిస్తే జెలెన్‌స్కీ భద్రతకు రష్యా పూర్తి హామీ ఇస్తుందని స్పష్టం చేశారు.

Advertisement