LOADING...
IND vs WI: భారత్-విండీస్ సెమీస్ రేసు.. ఆ ప్లేయర్ ఎంట్రీ ఇస్తే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!
భారత్-విండీస్ సెమీస్ రేసు.. ఆ ప్లేయర్ ఎంట్రీ ఇస్తే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!

IND vs WI: భారత్-విండీస్ సెమీస్ రేసు.. ఆ ప్లేయర్ ఎంట్రీ ఇస్తే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఈ పోరును వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు. గెలిచిన జట్టు టాప్-4లోకి అడుగుపెడుతుంది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండూ సూపర్-8 దశలో 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు సాధించాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంగా వెస్టిండీస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమి చవిచూసిన భారత్, జింబాబ్వేపై విజయం సాధించి మళ్లీ రేసులోకి వచ్చింది. మరోవైపు వెస్టిండీస్ జింబాబ్వేపై గెలిచినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది.

Details

వర్షం పడితే ఏమవుతుంది?

ఈ మ్యాచ్ విజేతకు సెమీఫైనల్ టికెట్ ఖాయం. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే పరిస్థితి క్లిష్టమవుతుంది. మ్యాచ్ 'నో రిజల్ట్'గా ముగిస్తే రెండు జట్లకూ ఒక్కో పాయింట్ లభిస్తుంది. అలా జరిగితే వెస్టిండీస్ మొత్తం 3 పాయింట్లతో ముందంజలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుతుంది. భారత్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అందువల్ల వర్షం ప్రభావం టీమిండియాకు భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. పూర్తి మ్యాచ్ జరగడం భారత్‌కు అత్యంత కీలకం.

Details

గ్రూప్ టాపర్ మారే ఛాన్స్?

సూపర్-8 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జింబాబ్వేతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ తేడాతో ఓడిపోతే, భారత్-వెస్టిండీస్ మ్యాచ్ విజేత గ్రూప్ టాప్‌గా నిలిచే అవకాశం ఉంది. అలా జరిగితే గ్రూప్ టాపర్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. గ్రూప్ రన్నరప్ అయితే ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది.

Advertisement

Details

జట్లు ఇవే

భారత్ జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. వెస్టిండీస్ జట్టు బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మయ్యర్, రోస్టన్ చేజ్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, రోవ్మాన్ పావెల్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, అకీల్ హోసేన్, గుడాకేశ్ మోటీ, షమర్ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్, క్వెంటిన్ సాంప్సన్. మొత్తానికి, భారత్-వెస్టిండీస్ మ్యాచ్ ఫలితమే సెమీఫైనల్ రేసును నిర్ణయించనుంది.

Advertisement