ప్రభుత్వం: వార్తలు

20 Mar 2023

ఫీచర్

భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR), నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను అరికట్టడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ విభాగం (DoT) ద్వారా నిర్వహిస్తుంది.

20 Mar 2023

ప్రకటన

ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం

దేశీయ మార్కెట్‌కు శుద్ధి చేసిన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగిసిన తర్వాత డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించాలని భారతదేశం ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

16 Mar 2023

ప్రపంచం

మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం

తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు.

15 Mar 2023

ప్రకటన

కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం

50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)పై 4% పెంపుదలని షెడ్యూల్ క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటీసును జారీ చేయలేదు.

15 Mar 2023

దిల్లీ

'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం

'పాత ఎక్సైజ్ పాలసీ'ని దిల్లీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ లోగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం

రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ(MRTH) జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితులను పెంచాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత స్పీడ్ రివిజన్ భారతదేశ రవాణా మౌలిక సదుపాయాల భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

01 Mar 2023

దిల్లీ

దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం

సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానంలో సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు వారి పేర్లను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు.

మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI

ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్

జీఎస్టీ కౌన్సిల్ శనివారం ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లు , కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవా పన్నును తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి

ఈ ఏడాది మార్చి 31లోపు పాన్‌ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు.

జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం

ఆల్-ఇండియా హోల్ సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా దేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2022లో నమోదైన 4.95% నుండి జనవరి 2023 (జనవరి 2022 కంటే) నెలలో 24 నెలల కనిష్ట స్థాయి 4.73%కి తగ్గింది, తాత్కాలిక డేటా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం షేర్ చేసింది.

40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.

కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

08 Feb 2023

ఆర్ బి ఐ

#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?

08 Feb 2023

ఆర్ బి ఐ

రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

06 Feb 2023

ప్రకటన

సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 42 శాతానికి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా 5డాలర్ల నోటుపై బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఫొటో స్థానంలో దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త డిజైన్‌తో కరెన్సీ నోటు తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్

బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి.

23 Jan 2023

బడ్జెట్

బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు

భారత ప్రభుత్వం మార్చి 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 16 ట్రిలియన్ రూపాయలు ($198 బిలియన్లు) అప్పుగా తీసుకుంటుంది.

BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.