Page Loader
HMPV: దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదల.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్‌ ముమ్మరం
దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదల.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్‌ ముమ్మరం

HMPV: దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదల.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్‌ ముమ్మరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్షణ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హర్యానా ఆరోగ్య మంత్రి ఆర్టీ సింగ్ రావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ ఇన్ఫెక్షన్ పెరుగుతుండటంతో సివిల్ సర్జన్లందరికీ ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. హర్యానాలో ఇప్పటివరకు ఒక్క హెచ్‌ఎంపీవీ కేసు కూడా నమోదు కాలేదని, అయినా ఆరోగ్య శాఖను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు. వైరస్‌ ముప్పు నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్క్రీనింగ్ చర్యలు చేపడుతున్నారు.

Details

వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్

దగ్గు, జలుబుతో ఆసుపత్రులకు వచ్చే రోగులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సూచనలు జారీ అయ్యాయి. అనుమానాస్పద రోగులను స్క్రీన్ చేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తున్నారు. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను కలిగించేందుకు కారణమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది అధిక ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రభుత్వాలు నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి.