బంగ్లాదేశ్: వార్తలు

IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా

భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.

అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశేణి ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రస్తుతం టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మైదానంలో, వెలువల ఒక్కొసారి షకీబ్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో తరుచూ సమస్యల్లో చిక్కుకుంటాడు.

వన్డేల్లో షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డు

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డును సృష్టించారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షకీబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 71 బంతుల్లో 75 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తీశాడు. దీంతో వన్డే క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా షకీబ్ చరిత్రకెక్కాడు.

BAN vs ENG: అర్ధ సెంచరీతో చెలరేగిన షకీబుల్ హసన్

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. షకీబ్ 71 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో తన కెరీర్‌లో వన్డేలో 52 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (11), లిట్టన్ దాస్ (0) నిరాశ పరిచారు.

సంచలన రికార్డుకు చేరువలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ వన్డేలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మరుపురాని విజయాలందించిన షకిబుల్ తాజాగా మరో రికార్డుపై కన్నేశాడు. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య మాత్రమే ఇంతవరకు ఈ ఫీట్ ను సాధించారు.

బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం

ప్రపంచ దేశాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ మరోసారి చండికా హతురుసింఘ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం తెలిపింది. రెండేళ్ల పాటు కొత్త కోచ్‌గా చండికా బంగ్లాదేశ్‌కు సేవలందించనున్నారు. అంతకుముందు 2014 నుండి 2017 వరకు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా హతురుసింఘ పనిచేసిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్‌గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్‌పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం.

జనవరి 6న బీపీఎల్ సమరం

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. అటగాళ్లను జాబితాను ఆయా జట్టులు ప్రకటించాయి. బీపీఎల్ లీగ్ లో ఏడు జట్లు నువ్వా-నేనా అన్నట్లు గా పోటిపడనున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా బీపీఎల్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవికి రస్సెల్ డొమింగో రాజీనామా చేశాడు. భారత్‌తో బంగ్లాదేశ్‌ టెస్టు సీరిస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది. రెండు రోజుల తర్వాత రస్సెల్ డొమింగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.