T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. ముస్తాఫిజుర్‌కు అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
2026 టీ20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి లిటన్ దాస్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ముస్తాఫిజుర్ రెహమన్‌కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించడం విశేషంగా మారింది. పేస్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహమన్‌తో పాటు తస్కిన్ అహ్మద్ ప్రధాన బాధ్యతలు మోయనున్నారు. స్పిన్ విభాగాన్ని మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ నడిపించనున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ లిటన్ దాస్‌తో పాటు తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్‌లపై బంగ్లాదేశ్ జట్టు ఎక్కువగా ఆధారపడనుంది.
Details
భారత్ లోనే షెడ్యూల్
2026 టీ20 ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 17న ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ రెహమన్‌ను ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆడబోమని బంగ్లాదేశ్ ఐసీసీకి అధికారికంగా తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Details
2026 టీ20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ జట్టు ఇదే
లిటన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్ షాక్ మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమన్, తాంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.