Iran War: హర్మూజ్ వద్ద 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ప్రపంచ చమురు రవాణాకు కీలక కేంద్రంగా భావించే హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భారీ సైనిక దాడి చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతంలో భూగర్భంలో నిర్మించిన క్షిపణి స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. భూగర్భంలో బలంగా నిర్మించిన ఈ మిస్సైల్ కేంద్రాన్ని ఛేదించేందుకు సుమారు 5,000 పౌండ్ల బరువున్న లోతుగా చొచ్చుకుపోయే బాంబులను వినియోగించినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
Details
హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు
ఈ దాడికి సంబంధించిన వివరాలను సెంట్రల్ కమాండ్ తమ అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఈ క్షిపణి కేంద్రం ముప్పుగా మారిందని, అందువల్లే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామంతో హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.