Loading...
Korean Kanakaraju Review : కొరియన్ కనకరాజు రివ్యూ.. వరుణ్ తేజ్ కామెడీ వర్కౌట్ అయ్యిందా?
కొరియన్ కనకరాజు రివ్యూ.. వరుణ్ తేజ్ కామెడీ వర్కౌట్ అయ్యిందా?

Korean Kanakaraju Review : కొరియన్ కనకరాజు రివ్యూ.. వరుణ్ తేజ్ కామెడీ వర్కౌట్ అయ్యిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్‌తో పాటు దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాతలకు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం కావడంతో ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రారంభ టీజర్లతో వచ్చిన అంచనాలను ట్రైలర్ మరింత పెంచగా, హీరో-దర్శకుడు చేసిన వరుస ప్రమోషన్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఎట్టకేలకు స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

కథ

అనంతపురం జిల్లా పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపే యువకుడు కనకరాజు (వరుణ్ తేజ్). తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి సరదాగా జీవితం గడుపుతూ ఉంటాడు.

అదే సమయంలో కొరియా వెళ్లి స్థిరపడాలనే కలతో కియా కార్ల తయారీ యూనిట్‌లో పనిచేస్తున్న చైత్ర (రితిక నాయక్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.

అయితే అనూహ్యంగా కనకరాజు శరీరంలోకి ఓ కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది.

ఆ ఆత్మ కారణంగా కనకరాజు ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది? ఆ ఆత్మకు ఉన్న అసలు కథ ఏమిటి? చివరకు ఆ ఆత్మ అతడిని విడిచిపెట్టిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

వివరాలు

విశ్లేషణ

మొదటి నుంచి ఈ చిత్రాన్ని ఇండో-కొరియన్ హారర్ కామెడీగా ప్రచారం చేశారు. అయితే సినిమా ప్రారంభ భాగం మొత్తం పెనుగొండ నేపథ్యంతో నెమ్మదిగా సాగుతుంది.

కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించే వరకు కథనం పెద్దగా ఆకట్టుకోదు. కొన్ని సందర్భాల్లో బోర్ ఫీలింగ్ కూడా కలుగుతుంది.

అయితే ఆత్మ ఎంట్రీ తర్వాత సినిమా ఒక్కసారిగా వేగం అందుకుంటుంది. ముఖ్యంగా కనకరాజు, కిష్టప్ప పాత్రల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

సత్య తన వన్‌లైనర్లు, ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించగా, వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ కూడా చక్కగా వర్కౌట్ అయింది. దీంతో ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

సత్య, వరుణ్ తేజ్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన బలం

ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అనంతరం కథ కొరియాకు మారుతుంది.

అక్కడి నుంచి కథనం కొంత ఊహించదగ్గ రీతిలో సాగినప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది.

అయితే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో లాజిక్స్ కంటే సినిమాటిక్ లిబర్టీకి దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరింత లాజికల్‌గా కథను తీర్చిదిద్దితే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేదనే భావన కలుగుతుంది.

అయినా హారర్ అంశాలు పెద్దగా భయపెట్టకపోయినా, కామెడీ మాత్రం పూర్తిస్థాయిలో వర్కౌట్ అవుతుంది.

ముఖ్యంగా సత్య, వరుణ్ తేజ్ కలిసి వచ్చే ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి.

ADVERTISEMENT

వివరాలు

నటీనటుల పనితీరు

పల్లెటూరి యువకుడు కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ పూర్తిగా ఒదిగిపోయాడు. అతని లుక్, మేకోవర్ పాత్రకు చక్కగా సరిపోయాయి.

యాక్షన్, కామెడీ, డ్యాన్స్—మూడు విభాగాల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్‌తో సమానంగా గుర్తింపు దక్కించుకునే నటుడు సత్య. అతను కనిపించే ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు.

వన్‌లైనర్లు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్ తరహా డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రితిక నాయక్ తన పాత్ర పరిధిలో చక్కగా నటించింది. మురళీధర్ గౌడ్ ఈసారి తన రొటీన్ పాత్రలకు భిన్నంగా కనిపించి మెప్పించాడు.

బుల్లిరాజు, విటీవీ గణేష్ ట్రాక్ కూడా మంచి వినోదాన్ని అందించింది. కొరియన్ నటీనటులు ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలకే పరిమితమైనప్పటికీ, తమ పాత్రలకు న్యాయం చేశారు.

వివరాలు

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. నేపథ్య సంగీతం కూడా కథకు తగ్గట్టుగా సాగింది.

తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. రచయితగా, దర్శకుడిగా మేర్లపాక గాంధీ మరోసారి తన శైలిని చూపించే ప్రయత్నం చేశారు.

అయితే కథలో లాజికల్ అంశాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత బలంగా నిలిచేదనే భావన కలుగుతుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది.

గ్రాఫిక్స్ నాణ్యత కూడా మెప్పిస్తుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండగా, నిర్మాణ విలువలు సినిమాకు మరో ప్లస్‌గా నిలిచాయి.

వివరాలు

ఫైనల్‌గా

'కొరియన్ కనకరాజు' పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. హారర్ అంశాలు పరిమితంగానే ఉన్నప్పటికీ, కామెడీ మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

మొదటి భాగంలో కొంత నెమ్మదిగా ప్రారంభమైనా, ఆత్మ ఎంట్రీ తర్వాత కథనం పుంజుకుంటుంది.

వరుణ్ తేజ్, సత్యల కామెడీ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. లాజిక్స్‌ను పక్కనపెట్టి వినోదాన్ని ఆస్వాదించే వారికి ఈ సినిమా మంచి ఎంటర్‌టైనింగ్ అనుభూతిని అందిస్తుంది.

ADVERTISEMENT