Loading...
Used Vape Batteries: ఇంజనీరింగ్‌ అద్భుతం... వాడేసిన వేప్‌లతో బ్యాటరీ తయారీ
ఇంజనీరింగ్‌ అద్భుతం... వాడేసిన వేప్‌లతో బ్యాటరీ తయారీ

Used Vape Batteries: ఇంజనీరింగ్‌ అద్భుతం... వాడేసిన వేప్‌లతో బ్యాటరీ తయారీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

వాడేసిన వేప్‌ పరికరాలు సాధారణంగా చెత్తకుప్పల్లోకి వెళ్లిపోతాయి. కానీ బ్రిటన్‌కు చెందిన 26 ఏళ్ల ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌ క్రిస్‌ డోయెల్‌ వాటిలోని బ్యాటరీలను మాత్రం పనికిరానివిగా చూడలేదు. సుమారు 500 వాడేసిన వేప్‌ల నుంచి లిథియం బ్యాటరీలను సేకరించి 2.5kWh సామర్థ్యంతో ఓ బ్యాటరీ ప్యాక్‌ను తయారు చేశాడు. దాన్ని ఇంటి విద్యుత్‌ వ్యవస్థకు అనుసంధానించి మైక్రోవేవ్‌, కెటిల్‌, లైట్లు వంటి పరికరాలను ఏకంగా 8 గంటల పాటు నడిపించాడు. ఈ సమయంలో గ్రిడ్‌ నుంచి విద్యుత్‌ తీసుకోకపోవడం ఈ ప్రయోగంలో ప్రత్యేకత.

Details

లీడ్స్‌ ఫెస్టివల్‌లో మొదలైన ఆలోచన

డోయెల్‌కు ఈ ఆలోచన ఒక్కరోజులో రాలేదు. లీడ్స్‌ ఫెస్టివల్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్న సమయంలో చాలామంది వేప్‌ పరికరాలను వాడేసి పడేయడాన్ని గమనించాడు.

వాటిని పరిశీలిస్తే లోపల ఇంకా పనిచేసే రీచార్జబుల్‌ లిథియం బ్యాటరీలు ఉండటం అతడిని ఆలోచింపజేసింది.

దీంతో వేప్‌లను సేకరించి వాటిలోని భాగాలను మళ్లీ ఉపయోగించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

సెప్టెంబర్‌ 2024లో 35 బ్యాటరీలతో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లకు ఉపయోగపడే పోర్టబుల్‌ ఛార్జర్‌ను తయారు చేశాడు. ఆ చిన్న ప్రయోగమే తర్వాత పెద్ద ప్రాజెక్టుకు బాట వేసింది.

Details

2,000 వేప్‌ల నుంచి 500 బ్యాటరీల ఎంపిక

ఇంటి అవసరాలకు సరిపడే పెద్ద బ్యాటరీ వ్యవస్థను తయారు చేయాలని నిర్ణయించుకున్న డోయెల్‌ 2025 మేలో ఓ స్థానిక వేప్‌ షాపును సంప్రదించాడు.

కస్టమర్లు తిరిగి ఇచ్చిన వాడేసిన పరికరాలను తనకు ఇవ్వాలని కోరాడు. ఆ షాపు సుమారు 2,000 వేప్‌లతో కూడిన పలు బ్యాగులను అందించింది.

వాటిలోని రీచార్జబుల్‌ బ్యాటరీలను విడదీయడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది. చివరకు ఇంటి బ్యాటరీ ప్రాజెక్టుకు సరిపడే 500 సెల్‌లను ఎంపిక చేసి, వాటిని 3D ప్రింట్‌ చేసిన కేసులో అమర్చి 2.5kWh బ్యాటరీ ప్యాక్‌గా రూపొందించాడు.

ADVERTISEMENT

Details

భద్రతకు ఫ్యూజ్‌.. ఇంటికి 8 గంటల పవర్

ఇలాంటి బ్యాటరీలతో ప్రయోగం చేయడం అంత సులభం కాదు. లిథియం-అయాన్‌ బ్యాటరీలు దెబ్బతిన్నా, తప్పుగా కనెక్ట్‌ చేసినా షార్ట్‌ సర్క్యూట్‌ లేదా మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.

అందుకే డోయెల్‌ బ్యాటరీల మధ్య ఫ్యూజ్‌ను ఏర్పాటు చేశాడు. అనంతరం ఇన్వర్టర్‌ ద్వారా ప్యాక్‌ను ఇంటి విద్యుత్‌ వ్యవస్థకు అనుసంధానించాడు.

పరీక్షలో మైక్రోవేవ్‌, కెటిల్‌, ఇంటి లైట్లు వంటి పరికరాలకు 8 గంటల పాటు విద్యుత్‌ అందించాడు.

ఈ ప్రయోగాన్ని యూట్యూబ్‌లో పంచుకోగా లక్షలాది మంది చూశారు. ఇప్పుడు దీన్ని సోలార్‌ ప్యానెళ్లతో అనుసంధానించే మార్గాలను పరిశీలిస్తున్నాడు.

ADVERTISEMENT

Details

వేప్‌ వ్యర్థాలు.. మరో పెద్ద సమస్య

డోయెల్‌ ప్రయోగం కేవలం బ్యాటరీ తయారీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. వాడేసిన వేప్‌ల వల్ల పెరుగుతున్న ఈ-వేస్ట్‌ సమస్యను కూడా ఇది గుర్తుచేస్తోంది.

బ్రిటన్‌లో 2025 జూన్‌ 1 నుంచి సింగిల్‌ యూజ్‌ వేప్‌ల విక్రయం, సరఫరాపై నిషేధం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ వ్యర్థాల సమస్య పూర్తిగా తగ్గలేదు.

2025 జూన్‌ నుంచి 2026 మార్చి మధ్య నాలుగు వ్యర్థాల నిర్వహణ కేంద్రాల్లోనే 20 లక్షలకు పైగా తప్పుగా పడేసిన వేప్‌లు గుర్తించినట్లు సమాచారం.

అయితే ఇలాంటి బ్యాటరీలను ఇంట్లో స్వయంగా విడదీసి తిరిగి ఉపయోగించడం మాత్రం ప్రమాదకరం. సరైన సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా పరికరాలు లేకుండా లిథియం బ్యాటరీలతో ప్రయోగాలు చేయకూడదు.

ADVERTISEMENT